Monday 7 May 2012

 శ్రీ  సాయి భక్తులందరికి, బాబా వారిని శుభాసీస్సులు అందించమని మా సాయి కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.


 మా కుటుంబంలో జరిగిన ప్రత్యేక అద్భుతం మీకు ముందే విన్నవించాము. ఉదయం 3.30 గంటలనుండి పూజ మొదలుపెట్టాము. అభిషేకం, అష్టోత్తరం, అర్చన చేశాము. మనస్ఫూర్తిగా బాబాని మన అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిద్దాం  .

సాయి భావన

ఈ సాయి భావన "శ్రీ శిరిడి సాయి వ్రతకల్పము (హింది మూలం శ్రీ నిసా జానీ గారిచే రచింపబడినది) తెలుగు లొ శ్రీ కమ్మిల బాబూరావు గారిచే అనువదింపబడిన పుస్తకమునుండి గ్రహింపబడినది. మన సాయి భక్తులందరూ కూడ దీనిని ప్రతీరొజు లేదా ప్రతి గురువారము నాడు చదువుకొనవచ్చును.


సాయి భావన
1. జయ ఈశ్వర సాయి దయాళూ నీవే జగతికి పాలన కర్తవు
2. దత్త దిగంబరావతారా నీ అధీనమే సాయి ఈ జగమంతా
3. త్రిమూర్త్యవతారా శరణాగతులకు నీవే ప్రాణాధారం
4. దర్సనమీయుము ఓ ప్రభు సాయి
5. కఫినీ వస్త్రము ధరియించి, భుజముకు జోలి తగిలించి
6. నింబ వృక్షపు ఛాయలో కనిపించి, ఫకీరు వేషము ధరియించీ
7. పతితుల ఈ జగాన ఉథ్థరించుటకు, కలియుగాన అవతరించితివి
8. శిరిది గ్రామం నీవాసం, జనుల హ్రుదయాల గెలిచితివీ
9. చిలుమును చేపట్టీ మురళీమొహను రూపమయీ
10. నీ కన్నులు మాపై దయచూపూ నీ పలుకులు అమృతధారలు కురిపించూ
11. ఎక్కడ నీ థుని ఉన్నా సాయి పాపాలన్నీ మాడిపోవును
12. నేరక తప్పులు చేసితిమీ మము కరుణించీ వరమీవా సాయి
13. కరుణసింధూ ఓసాయి - నీ ద్వారమున నిలిచితిమీ
14. అగ్నిహోత్రి శాస్త్రికి దర్శనమిచ్చి మహిమ జూపితివి
15. శ్యామాను రక్షింతివి - పాము విషము తొలగించి
16. ప్రళయకాలమునాపితివి - భక్తుల భయముక్తుల చేసితివీ
17. మహమ్మరిని మాపితివి - శిరిది పురిని రక్షించితివీ
18. వందనమయ్యా ఓ సాయి - నీ చరణాలపై శిరసుంచితినీ
19. మనసున కోర్కెలు నెరవేర్చు - భవసాగరమును దాటించు
20. భక్త భీమాజీ క్షయరోగం - ఉపచారాలెన్నో చెసితివీ
21. పరమ పవిత్రం నీ ధునిఊదీ - నశియంచెను భీమాజీ క్షయరోగం
22. విఠలరూపము ధరియించీ కాకాజీకి కనిపించితివీ
23. దామూకొసగీ సంతానం - సంతుష్టునిగా చెసావూ
24. ఓ కృపాళూదయజూడుమయా - దీనదయాళూదయామయా

25. సర్వస్వం నీ కర్పించితినీ - సద్గతినిమ్మూ ఓ సాయి
26. మేఘా నీవెవరో తెలియకనయా - ముస్లిముగా భావించెనయా
27. శివశంకర రూపం ధరియించీ - ఇఛ్చావయ్యాదర్శనము
28. జలమును నూనెగ మార్చితివీ - వెలింగించావూ దివ్వెలను
29. చూసీ వింతైన ఆదృశ్యం అచ్చెరువొందెను ఆగ్రామం
30. చాంద్పటెల్ చింతించె గుర్రము దొరకక మనమున

31. సాయినీకృప వలన - గుర్రము తిరిగి లభియించె
32. శ్రథ్థ సబూరి మనమున నిలిపి - సాయి నామము తలవండీ
33. సతతము సాయిని తలచిన - మనసున కోర్కెలు ఫలియించూ
34. తాత్యా ఆపద గుర్తించీ - నీ అయువునతనికి ఇచ్చితివీ
35. బాయిజా సేవలు మెచ్చితివీ - ప్రతిఫలమామెకు ఇచ్చితివీ
36. పశుపక్షులను ప్రేమించి - ప్రేమతో వాటిని లాలించి
37. యెల్లర సమముగ చూసితివీ - స్వయముగ సేవలు చేసితివీ
38. నీ శరణన్న వారలను - నీ వారిగ భావించితివి
39. పదకొండూ నీ వచనాలూ - భక్తులకొసగిన వరాలూ
40. అణువణువున నీవే ఓ సాయి - నీ లీలలు బహుచిత్రమయా
41. ఏరీతిగ నీగుణగానము గావింతూ - బుథ్థిహీనుడనోసాయి
42. ఓ దీనదయాళూ దయచూపుమయా - మా అందరిపాలిట ప్రభువయ్యా
43. నా పై కృపను చూపుమయా - నీ చరణాలను నెరనమ్మితిని
44. నిండు భక్తితో చేయండిగానం - లభించును ముక్తికి మార్గం
45. రేయి పగలు నీ ధ్యానం - నిత్యం నీ లీలా పఠనం
46. సాయి వారితో నడచునయా - ఒకరి కొకరుగాకలగలిసీ
47. నీ పలుకులు చేయును సంతసము - సాటిలేనిది సాయినామం
48. సాయి నామం నమ్మినవారికి - జీవన్ముక్తి ఒసగునయా
49. సాయి శక్తి విరాట స్వరూపము - సాయిరూపం మొహనరూపం
50. సతతము సాయి ధ్యానము చేయండి - సాయి జై అని పలకండి.

అనంతకోటిబ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సఛ్ఛిదానంద సద్గురు సాయినాథమహరాజ్ కీ జై
శ్రీ సద్గురు సాయి నాధర్పణమస్తు శుభం భవతు



templesdiary.com సౌజన్యంతో ...