Thursday 10 May 2012

సాయి చరణం మనకింక శరణం

సాయి భక్తులకి సాయిప్రియ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.. కేవలం  5 రోజులలో  వీక్షకుల సంఖ్య సహస్రం దాటింది. సాయి మహిమ అది. 'సాయి' అని పిలిస్తే 'ఓయి' అని పలుకుతారట. అలాగే మన బాబా భక్తులకు ఈ గురువారం, గురువుల వారం, జగద్గురువారం రోజు సాయిప్రియ కుటుంబం  ఆహ్వానం పలుకుతోంది. రండి ఈ బ్లాగుని ఫాలో అవండి ... మేము, మీరు , మనదరం కలిసి బాబా పై భక్తితో భక్తి ప్రచారం చేద్దాం. ఈ బ్లాగు అనుసంధానమైన ఫేస్ బుక్  కూడా వీక్షించండి. అందులో సభ్యులు కండి.

ఇందులో ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశం కలదు. బాబా చూపిన అపారమైన ప్రేమ, కరుణ, వారిపై మన భక్తి వెరసి అద్భుత సంఘటనలు, అనుభవాలు ఇక్కడ పంచుకొండి. సదా సాయి స్మరణే మనకి మూలంగా ఉందాము. సాయి ద్వారా పొందిన అనుభూతులు, అనుభవాలు మాతో,  బ్లాగు ప్రేక్షకులతో పంచుకొండి. ముందు ముందు ఈ అనుభవాల అనుభూతులని పుస్తకంగా ప్రచురించి ప్రతి సాయి భక్తుడికి పంచుతాము. మరి ఆలస్యమెందుకు సాయి పై మన భక్తిని చాటుదాం. భక్తిని ప్రచారం చేద్దాం. 
 ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి 



మా సాయి కుటుంబ ఉద్దేశ్యంలో అంటే మాతో సాయి.. ఒక స్నేహితుడు, అక మార్గదర్శి, తండ్రి.. మేము దేవుడు అని కాకుండా మా అనుంగు సహచరుడిగా సంభాషిస్తాం. కోపం వస్తే బాబా ఏంటిది అని కోపగిస్తాం? ఎందుకిలా చేశావు అని తిడతాము, అనందం వచ్చినరోజు ఆయనతో పాటు నృత్యం చేస్తాం. సాయి అంటే మా కుటుంబ సభ్యుడిగా అనుకుంటాం. మాతో పాటు బిర్యాని పెడతాము, అది లేనప్పుడు మాతో పాటు మజ్జిగ అన్నం పెట్టి సరిపెట్టుకోవా.. బాబా అని ప్రాధేయపడతాం. ఏది పెట్టినా ఎంతో ఆప్యాయంగా ఆరగించే మృధుస్వభావి మా కుటుంబ సభ్యుడు శ్రీ సాయి బాబా.

మీ మీ అనుభవ వివరాల తరువాత మరిన్ని అనుభవాలని మేము జత చేస్తాం. 

  ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి

సాయి చరణం మనకింక శరణం అని ప్రార్థిస్తూ....
******

ముఖ్యగమనిక: ఈ అనుభవాలను పంచుకోడంలో సాయిప్రియ కుటుంబ బంధువులకి సాయిప్రియ సత్సంగం ఆహ్వానం పలకడం లేదు. గమనించ ప్రార్థన.

సాయి ప్రియులకు, సాయి భక్తులకు, సాయి బంధువులకు, సాయి మిత్రులకు సాయిప్రియ మిత్రులకు ఇదే మా మనఃపూర్వక ఆహ్వానం.,