Tuesday 28 August 2012

కడివెడయిననేమి ఖరము పాలు

"గంగిగోవు పాలు గరిటెడయినను చాలు
కడివెడయిననేమి ఖరము పాలు "

అన్నట్టుగా .... :)

భక్తి పారవశ్యంలో మునిగి స్మరణలోని ఆనందాన్ని ఇచ్చే సాయి నామం మనందరికి ఉండగా మనకి సేవా సంగాలు, సత్సంగాలు అవసరమా? ఆయన మనసులోంచి మనల్ని ఎవరు బయటకి లాగగలరు? మన మనసుల్లోంచి ఆయనని ఎవరు బయటకి రప్పిస్తారు.. ?


అధికారం ఉంది అనుకుని అవకాశం వచ్చినప్పుడల్లా అలుసు చేస్తే బాబా భక్తుల మనసుల్లో బాబా ఊరుకుంటారా? మన మనసుల్నే ఆయనకి దేవలయాలుగా కట్టి ఇచ్చినప్పుడు అయనకి ఇంకో దేవాలయమంటూ .. బాహ్యపటాటోపాలతో .. భక్తి మాటలు మాట్లాడేవారికి బాబానే సరి అయిన దారిని చూపాలని ఆశిస్తూ..  

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్ఛిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ కి జై..
 నమఃశివాయ నమః శివాయ గంగాధరహర నమః శివాయా..
*****