Friday 14 February 2014

ఒక్కసారి పలకరించండి.. పెద్ద పెద్ద అగాధాలు పూడిపోతాయి..

ఓం శ్రీ సాయినాథాయ నమః 



ఒక్కసారి పలకరించండి.. పెద్ద పెద్ద అగాధాలు పూడిపోతాయి..

ఉన్నదే చిన్న లైఫ్.. ఎందుకుండాలి మనుషులకు దూరంగా? ఎంతమందికని దూరంగా జరుగుతాం.. మనస్సు కష్టపెట్టుకునీ, అవతలి మనిషి మనస్సు కష్టపెట్టీ?

మాటల తూటాలో, అపార్థపు మంటలో, వ్యక్తిత్వంలోని లోపాలో ఒకానొకప్పుడు మిమ్మల్ని విడిచి ఉండలేని స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ ఎవరి మానాన వారిని విసిరేసి ఉండొచ్చు.

కానీ మనుషుల్ని పోగొట్టుకుంటే ఏమొస్తుంది? పాత జ్ఞాపకాలు గుర్తొస్తే గుండెల్లో మెలిపెట్టే బాధ తప్పించి!!

తోటి మనిషిని క్షమించలేని గొప్ప గొప్ప వ్యక్తిత్వాలెందుకు?

వాళ్లూ చనిపోతారు, మనమూ చనిపోతాం... ఎవరి మానాన వాళ్లు చనిపోయే వాళ్లే అయినప్పుడు కనీసం బ్రతికున్నప్పుడైనా దూరమైన మనుషుల్ని కలుపుకుని సాగిపోతే ఎంత బాగుంటుంది?

ఊరికూరికే మనుషుల్ని దూరం చేసుకోకండి.. మనం బ్రతకాల్సింది మనుషుల మధ్యనే.. ఎవరి లోపాలెలా ఉన్నా వాళ్లు ఏదో రూపంలో మనల్ని అభిమానించే మనుషులే! వాళ్ల లోపాల్ని చూడకండి.. వారి అభిమానాన్ని చూడండి, అస్సలు దూరం చేసుకోబుద్ధి కాదు!!

- నల్లమోతు శ్రీధర్