Friday 14 February 2014

ఒక్కసారి పలకరించండి.. పెద్ద పెద్ద అగాధాలు పూడిపోతాయి..

ఓం శ్రీ సాయినాథాయ నమః 



ఒక్కసారి పలకరించండి.. పెద్ద పెద్ద అగాధాలు పూడిపోతాయి..

ఉన్నదే చిన్న లైఫ్.. ఎందుకుండాలి మనుషులకు దూరంగా? ఎంతమందికని దూరంగా జరుగుతాం.. మనస్సు కష్టపెట్టుకునీ, అవతలి మనిషి మనస్సు కష్టపెట్టీ?

మాటల తూటాలో, అపార్థపు మంటలో, వ్యక్తిత్వంలోని లోపాలో ఒకానొకప్పుడు మిమ్మల్ని విడిచి ఉండలేని స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ ఎవరి మానాన వారిని విసిరేసి ఉండొచ్చు.

కానీ మనుషుల్ని పోగొట్టుకుంటే ఏమొస్తుంది? పాత జ్ఞాపకాలు గుర్తొస్తే గుండెల్లో మెలిపెట్టే బాధ తప్పించి!!

తోటి మనిషిని క్షమించలేని గొప్ప గొప్ప వ్యక్తిత్వాలెందుకు?

వాళ్లూ చనిపోతారు, మనమూ చనిపోతాం... ఎవరి మానాన వాళ్లు చనిపోయే వాళ్లే అయినప్పుడు కనీసం బ్రతికున్నప్పుడైనా దూరమైన మనుషుల్ని కలుపుకుని సాగిపోతే ఎంత బాగుంటుంది?

ఊరికూరికే మనుషుల్ని దూరం చేసుకోకండి.. మనం బ్రతకాల్సింది మనుషుల మధ్యనే.. ఎవరి లోపాలెలా ఉన్నా వాళ్లు ఏదో రూపంలో మనల్ని అభిమానించే మనుషులే! వాళ్ల లోపాల్ని చూడకండి.. వారి అభిమానాన్ని చూడండి, అస్సలు దూరం చేసుకోబుద్ధి కాదు!!

- నల్లమోతు శ్రీధర్

Wednesday 30 October 2013

వాడాలో దొగలున్నారు జాగ్రత్త!!

జై సాయిమాస్టర్!
మన హృదయంలో వచ్చే ఏ భావాన్నీ మనం నమ్మడానికి వీలులేదు. ప్రత్యేకించి నెగిటివ్ గా వచ్చేవాటిని అసలు నమ్మడానికి వీలులేదు. పాజిటివ్ గా వచ్చేవాటిని నమ్మడం వల్ల మహా అయితే లౌకికంగా కొంచం నష్టపోతాము. ఒక మంచివాడు కానివాడిని మంచివాడనుకుని నమ్మి రూ.100/- యిచ్చామనుకోండి, మోసపోతే ఆ వంద రూపాయలతోనే పోతుంది. అంత వరకే. అది ఫర్వాలేదు. కాని నెగిటివ్ గా ఎవరి గురించి అలోచన వచ్చినా జాగ్రత్తగా వుండాలి. పాజిటివ్ గా వచ్చినపుడు గూడా జాగ్రత్త పడడంలో తప్పులేదు గాని నెగిటివ్ గా వచ్చినదాని గురించి జాగ్రత్త పడకపోతే ఆధ్యాత్మికతలో పాకుడుజారి ఎన్ని సార్లయినా పడవలసిందే! అదీ బాబా చెప్పిన "వాడాలో దొగలున్నారు జాగ్రత్త" అనే సూక్తికి అర్ధం.

శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "శ్రీ సాయిమాస్టర్ ప్రవచనములు

Saturday 26 October 2013

సాయి జీవన యాత్ర 25-10-2013


సాయి జీవన యాత్ర 24 వ తేదీనాడు ఆత్మ దర్శనం అని రాశాను కదా.. అందుకని రెండు రోజులు ఆగి మళ్ళీ ఈరోజు నిన్నటి జీవన యాత్ర రాయడానికి ఉపక్రమించాను. 

నిన్న శుక్రవారం బాగా గడించింది సాయికి  సదా ధన్యవాదాలు తెలపవచ్చు. ఎన్ని సమస్యలున్నా "నేనున్నాను  చింత వలదనే" చెప్తారు బాబా. సాయిప్రియ సత్సంగం  సభ్యుల యాంత్రిక జీవనంలోని కష్టాలే కాస్త ఎక్కువ , కాని అందులోనే సుఖం కోరుకుంటారు ఆ సభ్యులు, ఆ సాయి బాబా నామస్మరణలో ఆ సుఖం దాగి ఉంది మరి. ఇంతలా భక్తి పారవశ్యాలు కలగడానికి కారణం లేకపోలేదు. జులై 17 ఆత్మదర్శనం అని చెప్పాము అసలదేలా సాధ్యం? ఏమి లేకుండానే హఠాత్తుగా జులై  17 న అలా ఎందుకు జరిగింది అంటే.. అసలు సాయి వ్రతం తలపెట్టినదెవరు? సాయి సచ్చరిత్ర పారాయణం వెనకాల గల ఆంతర్యమేమిటి?.. ఇలా ఎన్నో ఎన్నెన్నోప్రశ్నలు.. అన్నిటికి ఒక్కొక్కటిగా సమాధానాలు చెప్పడానికే ఈ సత్సంగం.. ఒక్కో అనుభవం ఒక్కో అనుభూతి మాటలకందనిది. మనసులోనే ప్రతిష్టించుకున్న ఆ సాయినాధుని లీలలు వర్ణనాతీతం. 

మే 8, 2010 ఎంతో మాములుగా అందరిలా ఉన్న సాయిప్రియ సత్సంగం సభ్యుల ఇంట "నన్ను మర్చిపోయారా " అంటూ ఊధీదారణలో బాబా కనిపించారు. ఇలా.. 




 అప్పటికి కూడా ఇలాంటివన్ని నమ్మశక్యం కాని విషయాలని వదిలేసారు ఆ సభ్యులు కాని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ తరువాత నుండి ప్రతిసారి "నేనున్నాను " అంటూ పలుమార్లు తన ఉనికి తెలియపర్చారు శ్రీ సాయినాధుడు. దీని వెనుక గల మర్మమేమిటో ఇప్పటికి తెలుసుకోలేకపోయారు సాయిప్రియ సభ్యులు. తెలుసుకోగలిగేంత జ్ఞాన ప్రపత్తులు వారిలో లేకపోవడమే దానికి కారణమేమో.. అంతకు ముందు దాక మామూలు యాంత్రిక జీవనం గడిపిన ఆ సభ్యులకి జీవితమంటే కొత్త అర్థం తెలిసింది. వారి జీవితంలోకి నేను మీ కుటుంబ సభ్యుడనే అని వారి ఇంట అడుగిడిన సాయినాధుని,  ఈరోజువరకు అలా కుటుంబ సభ్యుని లాగేనే చూడడం జరుగుతోంది. 


అదీ సంగతి.. ఇదంతా ఈరోజు వరకు ఏవిధయమయిన ప్రచారం జరగకుండానే మావద్దే మా బాబా అని కొలుచుకున్నాము. ఇప్పుడు కూడా ఇదంతా రాయడం వెనకాల ఏ దురుద్దేశ్యం  లేదు. బాబా పై మాకున్న భక్తి మాలాంటి సాయిభక్తులకి పంచుదామనే ఆలోచనే తప్ప వేరే ఏ ఆలోచన లేదు. అందుకే మరో మారు చెప్తున్నాము  మా నమ్మకాలు మావి. మా నమ్మకాలని అపహాస్యం చేయవద్దని మనవి. ఇంకొకరి అభిప్రాయాలని మా సాయిప్రియ సత్సంగం ఏకీభవించకపోవచ్చు కాని గౌరవిస్తాము  అలాగే మా నమ్మకాలని ఎవరిని నమ్మమని మేము చెప్పడం లేదు, కాని అపహాస్యం చేయవద్దు. మాకున్న జ్ఞానానికి ఈ అదృష్టం చాలని మా ఆంతరంగిక ఆలోచన. దీని ద్వారా ఎదో సాధిద్దమన్న ఆలోచన కూడా మాలో లేదు. నమ్మినవారికి   సాయిభక్తులకి   సాయిప్రియ సత్సంగం  సగౌరవముగా ఆహ్వానిస్తోంది. మా సత్సంగం లోకి అడుగిడేవారు. జై శ్రీ సాయి రాం అని అనుకొని మనోనేత్రములతో సాయినాధుని దివ్య స్వరూపం చూసి ఒకే ఒక   లైక్ ని అందించమని ప్రార్థన. 

ఓం జై శ్రీ సాయి రాం

Thursday 24 October 2013

సాయి జీవన యాత్ర 24-10-2013

పొద్దున్న సాయి ప్రియ ఎవరు?   అంటు ఒక పోస్ట్ రాసాను కదా ఇంక ఈరోజుకి వద్దు అనుకున్నాను కాని బాబా తన స్మరణని అలా చేస్తూనే ఉండాలి అని నా మనసుకి అజ్ఞాపించాడేమో మరి,, బాబా పాదాలు వదలడం లేదు నా మనసు అందులో ఈరోజు మరి మన సాయినాధునికి ఇష్టమైన రోజు... గురువారం, బాబా వారం అందుకే మరి ఈరోజు ఆయనకి ఇంత చక్కగా గడపగలిగినందుకు ధన్యవాధాలు అర్పొఇద్దామని ఈ పోస్ట్. మరి చెప్పేముందు ఒక్కసారి వారిద్వార జరిగిన మరొక అద్భుతమైన అనుభవమొకటి అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్లుగా జ్ఞప్తికి తెచ్చుకుందామా?

ఆత్మ దర్శనం.. ఆత్మలు ఉన్నాయా? మనచుట్టూ తిరుగుతాయా లాంటి పెద్ద ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేము కాని.. ఈ అనుభవాన్ని మేము మాటల్లో పొదగలేము. సాయి మహిమని ఎంతని చెప్పగలము.. సాయి ప్రియ సత్సంగం ఏర్పడకముందు సాయిప్రియ కి సంబంధించిన సభ్యులందరూ సాయి పారాయణని భక్తితో చేద్దామని తలచి.. ఎంతో నిష్టగా సప్తాహం చేసారు.. ప్రతిరోజు ఆతరువాత రోజు పారయణలో వచ్చే సన్నివేశాలను బాబా ఏదో ఒక రూపేణా పారాయణం చేసేవారి కళ్ళముందు ఉంచడం ఒక మరుపురాని అద్బుతమైతే.. ఆరోజు సాయి ప్రియ కి ఒకే ఒక సందేశం.. మొదట అర్థం కాలేదు కాని తరువాత తరువాత మనసు అదుపులో పెట్టడం కష్టమయింది. సాయిప్రియ కి వచ్చిన ఆ అద్భుతమైన సందేశం: బాబా అంటే ఆరడుగుల మానవాకారం కాదు ఏదో ఒక రూపంలో ఎక్కడయినా ఉండొచ్చు. అన్నిటిలో బాబా ని కొలవండి.. రేపు మీకు ఆత్మ దర్శనం కలుగుతుంది.."

ఆత్మ దర్శనమా అంటే.. ఏమో మరి మాకేమి తెలుసు? ఎలా ఉంటుంది? బాబా ఎలా వస్తారు? ఏ రూపేణా వస్తారు ఎవరికి అంతుబట్టడం లేదు సాయిప్రియకి అసలు అర్థమే తెలీదు మరి ఏవిధంగా వర్ణించగలము? మర్నాడు అంటే జులై 17 పారాయణ ఆఖరి రోజు అంటే ఏడో రోజు  ఆరోజె వారి బంధువుల కుమారులకి  అక్షరాభ్యాసం , సాయి వ్రతం మొదలైన కార్యక్రమాలు , ఇంటి ముందు మంగళ వాయిద్యాలు, ఇంట్లో పూజలు  అంతా హడావిడి పిల్లలు పెద్దలు భక్తి పారవశ్యంలో పూజలు చేస్తున్నారు.. ఈ ఆనందాన్ని తమ కెమెరాల్లో భందిద్దామని  మరికొందరి ఆరాటం.. అలా సాయి వ్రతానికి ముందు  తీసిన ఒక ఫోటో లో ఆత్మ దర్శనం. ఎంత అద్భుతం ఒక మానవుని గొంతు నుండి మనసు దాక  ఎన్ని చిత్రాలు నిక్షిప్తం  చేయచ్చో కళ్ళకి కట్టినట్లుగా ఎంతో చక్కగా ఒక వృత్తాకరంలో ఒకవైపు శివుడు, మరో వైపు సాయినాధుడు ఇంకోవైపు నరసింహస్వామి అలా అందరు కొలువై ఉన్నట్లుగా అద్భుతం గోచరించింది ఆ ఫోటోలో.. శ్రీ కృష్ణ భగవానుడు యశోదకి తన నోటిలోనే  విశ్వాన్ని చూపించినట్లు ఆ సాయినాధుడు ఒక మానవునిలో తన విశ్వరూపాన్నిచూపించాడు.. నమ్మకంతో మన మనో నేత్రంతో చూస్తే మనం కోరుకునే భగవంతుడు కనిపించే ఆత్మదర్శనమది. అదోక అద్భుతం సాయిప్రియ సత్సంగం ఎంతటి పుణ్యం చేసుకుంటే ఆ అదృష్టం కలుగుతుంది. దీనిని మాటలలో వర్ణించగలమా? 

ఆత్మ దర్శనం అందరికి చూపించడానికి మాకు బాబా అనుమతి లేదు కాబట్టి మాకు కలిగిన ఆ సదవకాశాన్ని కొంతలో కొంతగా మీ అందరికీ చూపిస్తాము. ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నవారు సాయిప్రియ సత్సంగానికి ఒక లేఖ రాయండి  తప్పక ఆ సదవకాశాన్ని కలుగజేస్తాము. ఇదొక అత్యద్భుతమైన సాయిబాబా ఉనికి.
మా అడ్రస్:saipriyasatsangam@gmail.com
ఈ అడ్రస్ కి మీరొక మెయిల్ చేసే ముందుగా,  మీకు రోజు విన్నవించుకున్నట్లుగానే మరి మన సాయిప్రియ సత్సంగం కి ఒక చిన్న "లైక్" ... మరిచిపోరుగా...:-)  
ఓం శ్రీ సాయి రాం


సాయిప్రియ ఎవరు?


సాయి భవసాగర జీవన యాత్ర రాస్తున్న  నేను ముందుగా అసలు నేనెవరు అన్నది బ్లాగు లోకానికి, అటు ముఖపుస్తక పరిఛయస్థులకి తెలపాలని ఈ పోస్ట్. 

"నేను.."  మహా మహులకే తెలియలేదు "నేను" అంటే ఏమిటో మాములు మానవమాత్రురాలను నేనెమి చెప్పగలను? అయినా తప్పదు చెప్పాలి. సాయి ప్రియ నా అసలు పేరు కాదు. సాయి బాబాని  అత్యంత ఎక్కువగా ఇష్టపడతాను, కొలుస్తాను  కాబట్టి నన్ను నేను సాయి ప్రియ గా మార్చుకున్నాను. 2010 వరకు నేను మీ అందరిలాగా మాములుగానే ఉన్నాను. రోజు వారి పూజలు, కార్యక్రమాలతో సందడి సందడిగా.. మరి నన్నెందుకు మార్చుకోవాకున్నారో ఆ సాయినాధుడు తెలియదు కాని నేను ఆ సాయినాధుని అత్యంత ఇష్ట దైవముగా కొలిచే ప్రియని అయ్యాను అలా నేను సాయి ప్రియని. అంతే కాని నాలో ప్రత్యేకమంటూ ఏమి లేదు. ఇది నా పేరు చెరిత్ర.

ఇక నా చరిత్ర.. అందరి లాగే అమ్మా, నాన్నా అక్క,చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నదాన్ని. నాకు ఒక కుటుంబం ఉంది, నా బాధ్యతలు నాకున్నాయి అయినా సాయి మీద ఉన్న నా భక్తి ఏదో చెయ్యాలి, సాయి బాబా భక్తి తత్వాన్ని ప్రచారం చేయాలి అన్నఆరాటం  నాదిఏమి చెప్పాలి మీ అందరికి? ఎలా చెప్పాలి, మాటలకందని ఆ మహిమలని ఎలా మీ ముందుకు తీసుకురావాలి .. నమ్మనివాళ్ళు పరోక్షంగా ఒక్క మాట అన్నా బాధే కదా! మరి  ఎలా మీరందరూ నమ్ముతారు.. ఎలా? నాకే తెలీదు.. నేను ఒకప్పుడు మీ అందరిలా ఇవన్ని మనం నమ్మాలా? మనకెందుకు? అని వదిలేసిన దాన్నే కాని ఆ తరువాత మరి నాకెందుకీ ఉనికి నిరూపణలు జరిగాయో నాకు తెలీదు కాని నేను మారాను. మిమ్మల్నెవర్ని నేను మారమని అడగడం లేదు. దయచేసి గుర్తు పెట్టుకొండి, నేనెవరిని బాబా ని నమ్మండనో నా ప్రియ దైవం బాబా కాబట్టి మీరు కూడా కొలవండనో నేను చెప్పడం లేదు. నాకు జరిగిన అనుభవాలు, అద్భుతాలు సాటి భక్తులకు పంచుదామనే నా ఆకాంక్ష అందుకే ఫేస్ బుక్ లో సాయిప్రియ సత్సంగం పేరిట ఒక పేజ్ తెరిచాము. మాకున్న ఆత్మవిశ్వాసానికి సాయి బాబా పై ఉన్న నమ్మకాన్ని జోడించి ప్రతి ఒక్క సంఘటన మీ అందరి ముందు కళ్ళకి కట్టినట్లుగా ఉంచాలన్న ఆలోచన... ప్రేరణ..  ఈ సత్సంగం పేజ్. అందుకే ఇది దేవాలయం అయింది. దీనికి ఏ ప్రతిఫలాపేక్షా లేదు. మీరు మేము మనందరం.. సాయి భక్తులం అదొక్కటే మా ఆలంబన. 

అందుకే ప్రత్యేకంగా సాయి భక్తులను, సాయి నామం జపించేవారిని ఫేస్ బుక్ లో తీసుకున్నాము. చాలా మంది ఫ్రండ్ రిక్వస్ట్‌లు పంపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికి నేను చెప్పేది ఏమిటంటే, నేను ఫేస్ బుక్ కి కాని,  బ్లాగులకి కాని కొత్త కాదు. నా సొంత పేరుతో నాకో బ్లాగు ఉంది.. సాయి ప్రియ అనగానే ఏదో కాలేజ్ గర్ల్ అనుకుంటున్నారు. సారి ఫ్రండ్స్ !  నేను మధ్యవయసులో ఉన్న మహిళని, 40 లో ఉన్నాను. కాలేజ్ కి వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా అధ్యాత్మికతను , బాబా పై నా భక్తిని,   నన్ను నేను తెలుసుకోవాలనే ఈ ఫేస్బుక్. కాబట్టి నాకు ఫ్రండ్ రిక్వస్ట్ పంపేవాళ్ళకి కొంచం ఆలోచించుకుని పంపండి ప్లీజ్. ఇక మరొక్క మాట నేను ఎవరితో చాట్ చేయను. తప్పుగా భావించవద్దు. బాబా గురించి అయితే నేను ఆయన సేవకురాలిని కాబట్టి ఆయన గురించి నేనెప్పుడు చేతులు కట్టుకుని నిలబడతాను. 

భవిష్యత్తులో మన సాయి సత్సంగం వారిచే, ఒక ఆశ్రమం కట్టబడాలని, నా వయసువాళ్ళందరు అక్కడ విశ్రాంత జీవనం గడపాలని నాదోక ఆలోచన చూద్దాము అంతా సాయి ఆజ్ఞ.


సాయిప్రియ సత్సంగం లోకి అడుగు పెట్టేవాళ్ళు  ఎవరయినా పర్వాలేదు యువతులు, యువకులు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవారు చిన్నవారు అందరూ సాయి బాబాను తలుచుకుని మనస్ఫూర్తిగా మీ మదిలోని కోరికను నెరవేర్చమని ఆ బాబాని కోరుకుంటూ సత్సంగం పేజ్లోకి కాని, సాయిప్రియ ముఖపుస్తకంలోకి కాని కుడి చేత్తో మొదలు పెట్టండి. నేను, నా ఫేస్ బుక్ నా పేజ్ అని నేను అనడం లేదు "నా" , "నేను" అన్న మాటలు మర్చిపోయాము. మన ఫేస్ బుక్, మన పేజ్ అది. అందుకే మీరందరు  బాబాని తలుచుకుని సాయిప్రియ సత్సంగం  కి ఒకే ఒక్క లైక్.. ఇవ్వండి చాలు. మీ జీవితాలు సంతోషమయమవుతాయి అక్కడి ఆధ్యాత్మికతతో  ఇంతకన్నా ఏమి చెప్పలేను.

మీ అందరికి ఇదే మా సత్సంగ ఆహ్వానం. ఒక్కనిముషం...



అరెరె.. అంత కోపం వద్దండి.. మా కోసం కాదు బాబా కోసమన్నమాట..మన సాటి సాయి భక్తుల కోసం   :)



ఓం శ్రీ సాయి రాం. 

Wednesday 23 October 2013

సాయి దివ్య చరణం - భాగీరథి సమానం, సాయి దివ్య నామం - భవ తారక మంత్రం.

ఓం సాయి, శ్రీ సాయి.. జయ జయ సాయి..


బాగుంది కదా పొద్దున్నే కళ్ళు తెరవగానే ఆ భగవన్నామ స్మరణం. ఇంతకన్నా ఏమికావాలి ఈ చెంచాడు భవసాగరానికి, దీనినే ఒడ్డుకు చేర్చమని ఆయనని వేడుకోడం తప్ప. ఈరోజు లేవగానే అనిపించింది ఒక్కసారి మీ అందరిని పలకరిద్దామని.. సాయినాధునికి ఇష్టమైన రోజు, గురువారం.. సాయివారం, గురువుల వారం. ఒక్కసారి మనఃస్ఫూర్తిగా ఆ కరుణరసామూర్తికి మన భగీరధ సమానులైన సాయినాధుని  చరణాలని నమస్కరిద్దాము. ఆయన చరణం మనకి శరణం. 

ఇక్కడ చూస్తున్న ఈ చిత్రాలు మొదటిది సాయినాధుని నిజ చరణాలు షిర్డీలో...



రెండోది మన సాయి సత్సంగంలోని సాయినధుని నిజ చరణాలు ..



రెంటిని నమస్కరించుకుందాము మనదైన నమ్మకంతో ఆ సాయినాధుని శరణు వేడుదాము. ఇంత అల్లకల్లోలముగా ఉన్నా  మన దేశ పరిస్థితిని, మన పరిస్థితులను  ఒక ఒడ్డుకు చేర్చమని, మనల్ని దయచూడమని వేడుకుంటు... శుభోదయాన ఒక శుభకరమైన పనితో మొదలుపెడదాము. ఒక్కసారి మీ దక్షిణ హస్తముతో ఆసాయినాధుని కొలిచి అదే హస్తముతో ఇక్కడ ఉన్న మన సాయిప్రియ సత్సంగం ని ఒక్క క్లిక్ ఇచ్చి ఒకే ఒక " లైక్"  ద్వారా ఈరోజుని ఈ గురువారాన్ని ప్రారంభిద్దాము







ఓం శ్రీ సాయి రాం!

సాయి యాత్ర 23-10-2013 సాయినాథ మహరాజు కి జై..



ఈరోజు ఈ సాయి జీవన యాత్ర సాఫీగా సాగింది. సాయి భక్తుల ఇంట సాయి తన వాత్స్ల్యమైన చూపులతో రక్షిస్తాడు కాబట్టి సమస్యలున్నా ప్రిష్కారం కోసం అన్వేషిస్తూనే సాయి నామం జపించుకుంటు ఈరోజు యాత్ర కొనసాగించాము. ఆయన లీలలు ఇవి అని చెప్పడానికి మా సాయిప్రియ సభ్యుల తరమా? ఈరోజు మీ అందరితో ఈ అనుభవాన్ని పంచుకోవాలి అనుకొని నిశ్చయమయితే, అహ కాదు ఇది అహహ కాదు ఇంకోటి అని తెరల తెరలుగా అనుభవాల దొంతర కదలాడుతూ ఉంటుండి ఒక్కొక్కటి అక్షరాలలో పొదిగి, పదాలుగా మార్చి మీ ముందు ఉంచాలంటే ఈ సాయి ప్రియ సభులందరం మామూలు మానవమాత్రులం కదా.. ఏ సమస్యలకన్నా "నన్ను ఒక్కసారి స్మరించుకొండి నేను ఉన్నాను"  అని అభయమిచ్చే సాయినాధుడుండగా..సమస్యలకి పారిపోవడం తప్ప ఇంక వేరె దారేది :). 

2010 మే నెల మొదట్లో..సాయి భక్తులు.. ఒకప్పటిసాయిప్రియ  భక్త బృందంలోని  వారి బంధువులు ఒకరు ఇంట్లోంచి వెళ్ళి రాలేదు. missing case మనిషికి కొంచం మతిస్థిమితం లేదని చెప్పారు. అందరూ తలో చోటికి వెళ్ళి వెతికారుట. మా సభ్యులందరం ఏమి చెయాలో తోచక భక్తిగా సాయినాధుని వేడుకున్నాము. తప్పిపోయిన వారి బంధువులు ఒకరు సాయిబాబకి Dead line  లా "ఆరోజుకి మూడో రోజు తప్పిపోయిన వాళ్ళు కనపడాలి"  అప్పుడే నేను నమ్ముతాను అని సాయిప్రియ సత్సంగం గృహాంలో విన్నవించుకున్నారట. ఇది జరిగింది సోమవారం , అంటే బుదవారం డెడ్ లైన్ అన్నమాట.. వాళ్ళ భక్తి మహిమో, లేక సాయినాధుని కరుణాదృష్టో  బుధవారం ఉదయం 10 గంటలకి సదరు తప్పిపోయిన బంధువులనుండి ఫోన్ ఇంటికి తప్పిపోయిన వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చారని. ఇది మాయ కాదు మర్మము అంతకన్నా కాదు. భగవంతుని అద్భుత అనుగ్రహం. మన నమ్మకము. సాయిప్రియ సత్సంగం సభ్యులకి ఇలాంటి అనుభూతులెన్నో ఎన్నెన్నో.. భక్తితో మనము ఏమన్నా సాధించవచ్చు అన్నది సాయి బాబా  తన ఉనికి ద్వారా మనందరికి నిరూపిస్తున్నారు. 


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ!  యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజు కి జై.. 

పదండి మనం కూడా మన మనో నేత్రంతో షిర్డీలో జరిగే సాయినాథుని శేజ్ హారతి కళ్ళకద్దుకుని, ఈరోజు ఇలా మనల్ని కాపాడినందుకు ఆయనకి ధన్యవాదాలర్పిద్దాము. 

ఆగండి!  ఒక్క నిముషం.. వెళ్ళేముందు ఒక్కసారి,  ఒకే ఒక్కసారి ఇదిగో ఈ లింక్ పై  saipriyasatsangam ఒక లుక్కేసి సాయినాథుని సదా స్మరించుకుంటూ .. ఒకసారి క్లిక్ చేసి   ఒకే ఒక్క "like " ఇవ్వండి.. 

శుభ సాయి రాత్రి.