Tuesday 28 August 2012

కడివెడయిననేమి ఖరము పాలు

"గంగిగోవు పాలు గరిటెడయినను చాలు
కడివెడయిననేమి ఖరము పాలు "

అన్నట్టుగా .... :)

భక్తి పారవశ్యంలో మునిగి స్మరణలోని ఆనందాన్ని ఇచ్చే సాయి నామం మనందరికి ఉండగా మనకి సేవా సంగాలు, సత్సంగాలు అవసరమా? ఆయన మనసులోంచి మనల్ని ఎవరు బయటకి లాగగలరు? మన మనసుల్లోంచి ఆయనని ఎవరు బయటకి రప్పిస్తారు.. ?


అధికారం ఉంది అనుకుని అవకాశం వచ్చినప్పుడల్లా అలుసు చేస్తే బాబా భక్తుల మనసుల్లో బాబా ఊరుకుంటారా? మన మనసుల్నే ఆయనకి దేవలయాలుగా కట్టి ఇచ్చినప్పుడు అయనకి ఇంకో దేవాలయమంటూ .. బాహ్యపటాటోపాలతో .. భక్తి మాటలు మాట్లాడేవారికి బాబానే సరి అయిన దారిని చూపాలని ఆశిస్తూ..  

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్ఛిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ కి జై..
 నమఃశివాయ నమః శివాయ గంగాధరహర నమః శివాయా..
*****

Friday 6 July 2012

Sri Shiridi SAI BABA CHAALISA

శ్రీసాయి అష్టోత్తర శతనామావళి

  1. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః
  2. ఓం గురుదేవ దత్తాత్రేయాయ నాయినాథాయ నమః
  3. ఓం విశ్వ ప్రాణాయ సాయినాథాయ నమః
  4. ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః
  5. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః
  6. ఓం విశ్వలింగాయ నమః
  7. ఓం బహిరంతర్వ్యాపినే నమః
  8. ఓం దేహస్థ పృథివ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః
  9. ఓం చిద్రూపాయ నమః
  10. ఓం చైతన్య లింగాయ నమః
  11. ఓం సర్వవ్యాపినే నమః
  12. ఓం దిగంబరాయ నమః
  13. ఓం కేవలాయ నమః
  14. ఓం విశ్వసాక్షిణే నమః
  15. ఓం సర్వజీవ స్వరూపాయ నమః
  16. ఓం నామరూప రహితాయ నమః
  17. ఓం సర్వనామరూపిణే నమః
  18. ఓం విశ్వ రూపాయ నమః
  19. ఓం విరూపాయ నమః
  20. ఓం విరూపాక్షాయ నమః
  21. ఓం నిర్గుణాయ నమః
  22. ఓం నిశ్చలాయ నమః
  23. ఓం చంచలాయ నమః
  24. ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః
  25. ఓం దృశ్యాయ నమః
  26. ఓం దృగ్రూపాయ నమః
  27. ఓం హృదయాయ నమః
  28. ఓం సర్వలోకాత్మకాయ నమః
  29. ఓం సర్వలోక సాక్షిణే నమః
  30. ఓం సర్వదేవతా స్వరూపిణే నమః
  31. ఓం ఆకాశ గమనాయ నమః
  32. ఓం గమనాగమన రహితాయ నమః
  33. ఓం సర్వత్రస్థితాయ నమః
  34. ఓం సన్మాత్రాయ నమః
  35. ఓం సర్వాధారాయ నమః
  36. ఓం నాథనాథాయ నమః
  37. ఓం యోగాయ నమః
  38. ఓం యోగీశ్వరాయ నమః
  39. ఓం యోగయోగ్యాయ నమః
  40. ఓం యోగగమ్యాయ నమః
  41. ఓం సర్వయోగి స్వరూపిణే నమః
  42. ఓం సిద్ధిదాయ నమః
  43. ఓం సిద్ధాయ నమః
  44. ఓం సిద్ధయోగినే నమః
  45. ఓం సిద్ధరాజాయ నమః
  46. ఓం సిద్ధసంకల్పాయ నమః
  47. ఓం సర్వసిద్ధి సేవితాయ నమః
  48. ఓం విఘ్నరాజాయ నమః
  49. ఓం విఘ్నహంత్రే నమః
  50. ఓం విచిత్రవేషాయ నమః
  51. ఓం చిత్తచాంచల్యవినాశకాయ నమః
  52. ఓం చిత్తసాక్షిణే నమః
  53. ఓం భేదవర్జితాయ నమః
  54. ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః
  55. ఓం కృపానిధయే నమః
  56. ఓం కరుణామూర్తయే నమః
  57. ఓం సమదర్శినే నమః
  58. ఓం ఆత్మదర్శినే నమః
  59. ఓం పరమాత్మస్వరూపాయ నమః
  60. ఓం వర్షరూపకయజ్ఞకృతే నమః
  61. ఓం సకాలవర్షదాత్రే నమః
  62. ఓం సద్ధర్మసంరక్షకాయ నమః
  63. ఓం సదాచారవిగ్రహాయ నమః
  64. ఓం ఆచారవర్జితాయ నమః
  65. ఓం రోగనివారిణే నమః
  66. ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః
  67. ఓం సర్వాచార సంసేవితాయ నమః
  68. ఓం వేదవేద్యాయ నమః
  69. ఓం వేదాత్మనే నమః
  70. ఓం వేదకర్త్రే నమః
  71. ఓం వేదసంరక్షకాయ నమః
  72. ఓం యజ్ఞాయ నమః
  73. ఓం యజ్ఞ పురుషాయ నమః
  74. ఓం యజ్ఞభోక్త్రే నమః
  75. ఓం యజమానినే నమః
  76. ఓం జ్ఞానయజ్ఞాయ నమః
  77. ఓం ధ్యానయజ్ఞాయ నమః
  78. ఓం బోధయజ్ఞాయ నమః
  79. ఓం భక్తియజ్ఞాయ నమః
  80. ఓం సృష్టియజ్ఞాయ నమః
  81. ఓం చిదగ్నికుండాయ నమః
  82. ఓం విభూతయే నమః
  83. ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమః
  84. ఓం సంకల్పిత సర్వలోకాయ నమః
  85. ఓం ఆహారాయ నమః
  86. ఓం నిరాహారాయ నమః
  87. ఓం తీర్థపాదాయ నమః
  88. ఓం తీర్థపాలకాయ నమః
  89. ఓం తీర్థకృతే నమః
  90. ఓం త్రికాలజ్ఞాయ నమః
  91. ఓం కాలరహితాయ నమః
  92. ఓం దృగ్ దృశ్యభేదవివర్జితాయ నమః
  93. ఓం ప్రణవాయ నమః
  94. ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః
  95. ఓం దేవదేవాయ నమః
  96. ఓం దేవాలయాయ నమః
  97. ఓం సర్వధర్మ సంసేవితాయ నమః
  98. ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః
  99. ఓం ధర్మస్వరూపాయ నమః
  100. ఓం అవధూతాయ నమః
  101. ఓం లీలామానుష విగ్రహాయ నమః
  102. ఓం లీలా విలాసాయ నమః
  103. ఓం స్మృతిమాత్ర ప్రసన్నాయ నమః
  104. ఓం శిరిడీ నివాసాయ నమః
  105. ఓం ద్వారకామయి నిలయాయ నమః
  106. ఓం భక్తభార భ్రుతాయ నమః

సదా సత్స్వరూపం చిదానంద కందం....

ఇది ఉపాసనీ బాబా (కాశీనాథ్) గారు రచించినది.
స్తోత్రము


సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్సంభవస్థాన సంహార హే తుం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

భవధ్వాంతవిద్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం
జగత్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

భవాంబోధి మగ్నార్దితానం జనానం,
స్వపాద శ్రితానం స్వభక్తిప్రియాణం
సముద్ధారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

సదా నింబవృక్షస్య మూలాధివాసత్
సుధాస్రావిణం తిత్క మప్య ప్రియం తం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసై
సమవిష్కృతేసాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

సతాం విస్రమారామ మేవాభిరామం
సదా సజ్జనై సంస్తుతం సన్నమధ్భి
జనామోదదం భక్తభద్ర ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

అజన్మాధ్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతహ్ ప్రభొహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

శ్రీ సాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్ధిప్రద
యుష్మత్పాదరజహ్ ప్రభావమతులం ధాతపివక్తాక్షమహ్
సద్భక్త్యా శరణం కృతాంజలిపుటహ్ సంప్రాపితోస్మి ప్రభో
శ్రిమత్సాయి పరేశపాదకమలా న్నాన్యచ్ఛరణ్యం మమ

సాయిరూప ధర రాఘవోత్తమం
భక్తకామ విభుధ ధ్రుమం ఫ్రభుం.
మాయయోప హతచిత్త సుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా||

శరత్సుధాంశు ప్రతిమప్రకాసం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయపదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాకరోతు||

ఉపాసనాదైవత సాయినాథ
స్తవైర్మయోపాసనినా స్తుతస్త్వం
రమేన్మనో మే తవ పాద యుగ్మే
భృంగో యథాబ్జే మకరందలుబ్ధహ్||

అనేకజన్మార్జిత పాపసంక్షయో
భవేధ్భవత్పాద సరోజ దర్సనాత్
క్షమస్వ సర్వా నపరాధ పుంజకాన్
ప్రసీద సాయిస! గురో! దయానిధే ||

శ్రీ సాయినాథ చరణామృత పూత చిత్త
స్తత్పాద సేవనరతా సతతం చ భక్త్యా
సన్సార జన్య దురితౌఘ వినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి||

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యో నరస్తన్మనా సదా
సద్గురు సాయినాథస్య కృపా పాత్రం భవేధ్ధ్రువం ||

Wednesday 4 July 2012

భజనకి భక్తి ముఖ్యం.. ఆడంబరాలు కాదు...

Happy Baba's Day to you all.. 

100 మంది వచ్చేశారు... అని ఆడంబరంగా పలికి ఆర్భాటాలు చేసి.. ఆయాసపడే వారికి ఈ పలుకులు అమృతవాక్యాలే.. :) బాబా ఏనాడు ఆర్భాటాలు కావాలనలేదు.. నన్ను స్మరించుకో చాలు అంటున్నారు. సదా సాయి స్మరణలో .. - సాయిప్రియ సత్సంగం.

Monday 2 July 2012

సాయి నక్షత్ర మాలిక

 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సఛ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.
                               *****

 సాయి భక్తులకు , సకలకోటి భక్త జనావళికి సాయి ప్రియ సత్సంగం తరపున "గురు పౌర్ణమి " శుభాకాంక్షలు.

   సాయిరాం సాయిరాం జయ సాయిరాం...        ఓం సాయి శ్రీసాయి జయ సాయిరాం...        హరి ఓం హరి ఓం శ్రీ సాయిరాం.....        జయ జయ జయ ఓం జయ సాయిరాం


శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను  "నక్షత్ర మాలిక" గా ఎవరో సాయి భక్తుడు వ్రాసాడు. మనకున్న 27 నక్షత్రాల లాగ ఈ పాటకు 27 చరణాలున్నాయి.  ప్రతి చరణం తరువాత "సాయిరాం సాయిరాం ..." అని ఈ పాట చివరన ఇచ్చిన ఆఖరి చరణం పాడాలి

సాయి నక్షత్ర మాలిక 

1.    షిరిడీ సదనా శ్రీసాయి
       సుందర వదన శుభదాయీ
       జగత్ కారణా జయసాయి
       నీస్మరణే ఎంతోహాయీ                        || సాయిరాం ||

2.    శిరమున వస్త్రము చుట్టితివి
       చినిగిన కఫని తొడిగితివి
       ఫకీరువలె కనిపించితివి
       పరమాత్ముడ వనిపించితివి               || సాయిరాం ||

3.    చాందు పటేలును పిలిచితివి
       అశ్వము జాడ తెలిపితివి
       మహల్సా భక్తికి మురిసితివి
       సాయని పిలిచితె పలికితివి                 || సాయిరాం ||

4.    గోధుమ పిండిని విసరితివి
       కలరా వ్యాధిని తరిమితివి
       తుఫాను తాకిడిని నాపితివి
       అపాయమును తప్పించితివి              || సాయిరాం ||   

5.    అయిదిళ్ళలో భిక్షమడిగితివి
       పాపాలను పరిమార్చితివి
       బైజా సేవను మెచ్చితివి
      సాయుజ్యమును యిచ్చితివి               || సాయిరాం ||

6.    నీళ్ళను నూనెగ మార్చితివి
       దీపాలను వెలిగించితివి
       సూకర నైజం తెలిపితివి
       నిందలు వేయుట మాన్పితివి             || సాయిరాం ||

7.    ఊదీ వైద్యము చేసితివి
       వ్యాధులనెన్నో బాపితివి
       సంకీర్తన చేయించితివి
      చిత్తశాంతి చేకూర్చితివి                         || సాయిరాం ||

8.    అల్లా నామము పలికితివి
       ఎల్లరి క్షేమము కోరితివి
       చందనోత్సవము చేసితివి
       మతవిద్వేషాలు మాపితివి                  || సాయిరాం ||

9.    కుష్టురోగిని గాంచితివి
       ఆశ్రయమిచ్చి సాకితివి
       మానవధర్మము నెరపితివి
       మహాత్మునిగ విలసిల్లితివి                   || సాయిరాం ||

10.  ధునిలో చేతిని పెట్టితివి
       కమ్మరి బిడ్డను కాచితివి
       శ్యామా మొర నాలించితివి
       పాము విషము తొలగించితివి             || సాయిరాం ||

11.  జానెడు బల్లను ఎక్కితివి
       చిత్రముగా శయనించితివి
       బల్లి రాకను తెలిపితివి
       సర్వఙ్ఞుడ వనిపించితివి                        || సాయిరాం ||

12.  లెండీ వనమును పెంచితివి
       అహ్లాదమునూ పంచితివి
       కర్తవ్యము నెరిగించితివి
       సోమరితనము తరిమితివి                  || సాయిరాం ||

13.  కుక్కను కొడితే నొచ్చితివి
       నీపై దెబ్బలు చూపితివి
       ప్రేమ తత్వమును చాటితివి
       దయామయుడ వనిపించితివి             || సాయిరాం ||

14.  అందరిలోనూ ఒదిగితివి
       ఆకాశానికి ఎదిగితివి
       దుష్ట జనావళ్ని మార్చితివి
       శిష్టకోటిలో చేర్చితివి                            || సాయిరాం ||

15.  మహల్సా ఒడిలో కొరిగితివి
       ప్రాణాలను విడనాడితివి
       మూడు దినములకు లేచితివి
       మృత్యుంజయుడని పించితివి             || సాయిరాం ||

16.  కాళ్ళకు గజ్జెలు కట్టితివి
       లయబద్ధముగా ఆడితివి
       మధుర గళముతో పాడితివి
       మహదానందము కూర్చితివి               || సాయిరాం ||

17.  అహంకారమును తెగడితివి
        నానావళిని పొగడితివి
        మానవ సేవ చేసితివి
        మహనీయుడవని పించితివి              || సాయిరాం ||

18.  దామూ భక్తీని మెచ్చితివి
       సంతానమును యిచ్చితివి
       దాసగణుని కరుణించితివి
       గంగా యమునలు చూపితివి              || సాయిరాం ||

19.  పరిప్రశ్నను వివరించితివి
       నానాహృది కదిలించితివి
       దీక్షితుని పరీక్షించితివి
       గురుభక్తిని యిల చాటితివి                  || సాయిరాం ||

20.  చేతిని తెడ్డుగ త్రిప్పితివి
       కమ్మని వంటలు చేసితివి
       ఆర్త జనావళ్ని పిలిచితివి
       ఆకలి బాధను తీర్చితివి                       || సాయిరాం ||

21.  మతమును మార్చితె కసిరితివి
       మతమే తండ్రని తెలిపితివి
       సకల భూతదయ చూపితివి
       సాయి మాతగా అలరితివి                    || సాయిరాం ||

22.  హేమాదును దీవించితివి
       నీదు చరిత్ర వ్రాయించితివి
       పారాయణ చేయించితివి
       పరితాపము నెడబాపితివి                   || సాయిరాం ||

23.   లక్ష్మీబాయిని పిలిచితివి
        తొమ్మిది నాణెము లిచ్చితివి
        నవవిధ భక్తిని తెలిపితివి
        ముక్తికి మార్గము చూపితివి                || సాయిరాం ||

24.   బూటీ కలలో కొచ్చితివి
        ఆలయమును కట్టించితివి
        తాత్యా ప్రాణము నిలిపితివి
        మహాసమాధి చెందితివి                      || సాయిరాం ||

25.   సమాధి నుండే పలికితివి
        హారతి నిమ్మని అడిగితివి
        మురళీధరునిగ నిలిచితివి
        కరుణామృతమును చిలికితివి             || సాయిరాం ||

26.   చెప్పినదేదో చేసితివి
        చేసినదేదో చెప్పితివి
        దాసకోటి మది దోచితివి
        దశ దిశలా భాసిల్లితివి                         || సాయిరాం ||

27.   సకల దేవతలు నీవెనయా
        సకల శుభములు కూర్చుమయా
        సతతము నిను ధ్యానింతుమయా
        సద్గురు మా హృది నిలుపుమయా      || సాయిరాం ||

        సాయి నక్షత్రమాలిక
        భవరోగాలకిది మూలిక
        పారాయణకిది తేలిక
        ఫలమిచ్చుటలో ఏలిక

         సాయిరాం సాయిరాం రామ రామ సాయి రాం
        సాయికృష్ణ  సాయికృష్ణ కృష్ణ  కృష్ణ సాయి కృష్ణ
        సాయిరాం సాయిరాం రామ రామ సాయి రాం
        సాయికృష్ణ  సాయికృష్ణ కృష్ణ  కృష్ణ సాయి కృష్ణ
****

బాబా నిను ఒక్కసారి.....



నిన్న సాయి సత్సంగం తరపున  రెండు సంవత్సరములు క్రితం జరిగిన ఒకానొక అద్భుత సంఘటన పురస్కరించుకుని మా ఇంట భజన కార్యక్రమం నిర్వహించాము. ప్రతిసారి మేము మాకు వీలయినంతవరకూ, మా ఆర్ధిక  స్థితిగతుల ననుసరించి నిరాడంబరముగా భజన కార్యక్రమములు నిర్వహిస్తాము. అలాగే ఈసారి జరిగిన భజనకి ఒక మా కుటుంబ సభ్యులు కాక మరో 10 కుటుంబాలని పిలిచాము. మా ఇంట భజన అంటే అత్యంత ఉత్సాహంతో భజన సమయానికి ముందే అందరూ చేరుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ అధిక ప్రసంగాలు, అనవసర కాలాయాపనలు ఉండవని భక్తులందరికి తెలుసు. పూజ సమయానికి చేరుకుని భజన అంతా కనులవిందుగా వీక్షించి ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. మేము ఎవరినన్నా మర్చిపోతే, "మీరు పిలవకపోయినా మేము వస్తాము " అనేంత అమితమైన అభిమానం మా ఇంటికి వచ్చే సాయి భక్తులకి.

అలాగే నిన్నటి భజనకి సాయి భక్తులు ఎంతో లీనమై భజన చేశారు. అలాంటి సమయంలో బృంధ సభ్యులొకరు పాడిన పాటకి ఆ సభ్యుడు మరియు భజన కావిస్తున్న భక్తులు ఒకవిధమైన ట్రాన్స్ లోకి వెళ్ళి కళ్ళనుండి నీళ్ళతో ఎదురుగా బాబా కూర్చుంటే తమ బాధలు విన్నవిస్తున్నారన్నంతగా   భక్తిలో లీనమయ్యారు , ఎవరో ఒకరిద్దరు అత్యుత్సాహం , అధిక ప్రసంగము కావిస్తూ బాహ్య పటాటోపాలు చూపించారు తప్ప .. ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా ఆ భక్తి రసంలో మునిగి తేలియాడారు.. ఆనందం పట్టలేక మరొక్కసారి ఆ పాటని వినిపించమని భజన బృందానికి వేడుకున్నారు. 


ఆ భజనకి సంబంధించి వైబ్రేషన్స్ అలా ప్రతిఒక్కరిని ఈరోజు ఉదయం కూడా వెంటాడుతుండగా భజన బృందం సభ్యుడు ఈరోజు మాకు ఫోన్ చేసి,  ఈ మధ్య కాలంలో ఇంతటి ఆనందం కాని, ఇంతటి భక్తిలో లీనమవడం కాని, ఇంతటి వైబ్రేషన్స్ కాని కలగలేదంటూ.. ఎన్నోచోట్ల యాంత్రికంగా చేశాము కాని ఇక్కడ బాబా అలా ప్రత్యక్షంగా మాముందు కూర్చున్నట్లుగా ఉందని, ఆ భావన తన ఒక్కరిదే కాదని, అందరూ ఆ భావనని అనుభవిస్తున్నారని ఆనందంతో చెప్పారు. వారి అనుభవం ఒక ఎత్తయితే, ఇంటి దగ్గర సత్సంగానికి సంబంధించి ఇద్దరు మహిళలు ఈ భజనకి రావడం చూడడం జరిగింది. ఇంకా ఆ ట్రాన్స్ నుండి రాలేకపోతున్నామని, పొద్దున మరల వారి సత్సంగ సభ్యులతో సహ ఒక 10 మంది దాకా.. మా ఇంటికి వచ్చి కాసేపు ధ్యానం చేసుకుని మరికాసేపు మాతో ముచ్చటించి వెళ్ళారు.

ఇక్కడ ఈ సంఘటన ద్వారా మాకర్థమయింది ఒకటే బాబా అదృశ్య శక్తి గురించి, అద్భుతాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిజమైన భక్తులు వాటిని తెలుసుకోడానికి కాకపోయినా, వారి లీలలు కళ్ళార చూడడానికి వస్తారు. ఇలాంటి విషయాలు ఎంతోమంది భక్తులమని చెప్పుకునే కొంతమంది పెద్దమనుషులకి తెలియకపోవడం.. అసలు మొదలు, మూలాలు మర్చిపోయి ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాము.. అలాంటి వారి జోలికి సాయి భక్తులు వెళ్ళి అభాసుపాలు కాకండి. వారిని గమనించడం చాలా తేలిక..

వారి లక్షణాలు:

1. బాహ్య పటాటోపాలు ఎక్కువ
2. ఆడంబారాలు, అధిక ప్రసంగము..
3. సంసారం తృణప్రాయమని చెప్తూనే.. వారి కుటుంబం.  ఆ సభ్యుల గొప్పతనం అంటూ ఊదర గొట్టడం, ఇవన్నీ మాములుగా కలిస్తే కాదు సత్సంగాల నియమాలనుల్లంఘించి చెప్తూ ఉంటారు.
4. జిహ్వ చాపల్యానికి అతీతులమంటూనే రుచుల యుద్ధాలు చేయడం....
5. గాలి ఏటువైపు బాగా వీస్తే అటు మర్లి పోవడం..
6. వారిననుసరించి  బాహ్య పటాటోపాలు అత్యుత్సాహం చూపే మరికొందరు..
**********


 ఇక ట్రాన్స్ లోకి వెళ్ళి ఎంతో ఆనందంగా భజన చేస్తూ మళ్ళీ   మళ్ళీ వినాలనుకున్న,  ఆ సాయి కరుణ మనపై కురిపించే అతి మధురమైన ఆ పాట ఇక్కడ మీ కోసం.

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా ..


బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా .

నీపాద సన్నిధిలో నాకు కాస్త చోటిస్తే...
నీ పాద సన్నిధిలో నాకు కాస్త చోటిస్తే..

జ్యోతినై వెలుగుతాను నీ మందిరానా ...
జ్యోతినై వెలుగుతాను నీ మందిరానా ..

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోనా ఈ మాట చెప్పాలయ్యా .

ప్రతి నిముషం సమరముగా కాలమేమో కదులుతోంది
చిరుగాలుల తాకిడిలో ఆకులాగ రాలిపోగా

ప్రతి నిముషం సమరముగా కాలమేమో కదులుతోంది
చిరుగాలుల తాకిడిలో ఆకులాగ రాలిపోగా

స్వార్థమైన సమాజం వరదలాగా మారుతుంటే          
స్వార్థమైన సమాజం వరదలాగా మారుతుంటే                  బాబా.......

చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నావా
నీవు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నావా ...


బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా .

అలలపైన సాగేటి మా ఆశల నౌకకి
దారేమో కానరాదు ఈ జీవన కడలిలో

అలలపైన సాగేటి మా ఆశల నౌకకి
దారేమో కానరాదు ఈ జీవన కడలిలో

సారధిగా వారధిగా తోడు నీడ నీవై
సారధిగా వారధిగా తోడు నీడ నీవై                   బాబా.......

నిన్నే నమ్ముకున్నాము మా సాయిబాబా
నిన్నే ... నమ్ముకున్నాము మా సాయి బాబా...

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా....

శ్రీ సాయిబాబా చాలీసా


షిరిడి వాస సాయిప్రభో  - జగతి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓసాయి కరుణించు కాపాడోయి
దర్శనమీయగ రావయ్య ముక్తికి మార్గం చూపవయా               ||షిర్డి||

కఫినీవస్త్రము ధరియించి భుజమునకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వేలిసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం                         ||షిర్డి||

చాంద్ పాటిల్ ను కులుసుకొని అతని బాదలు తీర్చితివి.
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం                    ||షిర్డి||

బాయిబా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యం కొలిచితిని
అభయమిచ్చి బ్రోవుమయా నీలో నిలిచెను శ్రీ సాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి                 ||షిర్డి||

ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ   నాశనం కాపాడి  షిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి                     ||షిర్డి||

భక్త భీమాజికి క్షయ రోగం నశించే అతని సహనం
ఊచీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్సన మిచ్చితివి
దాము కిచ్చి సంతానం కలిగించితివి  సంతోషం                          ||షిర్డి||

కరుణసింధూ   కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నేను మేఘా తెలుసుకొని అతని బాధ
దాల్చి శివ శంకర రూపం  - ఇచ్చావయ్యా దర్శనము                  ||షిర్డి||

డాక్టరుకు నీవు రామునిగా బల్వంత్ కు నీవు దత్తునిగా
నిమోనుకర్ కు  మారుతిగా చిదంబరం కు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా గణుకు సత్యదేవునిగా
నరసింహ స్వామిగా జోషి కి దర్శనమిచ్చిన శ్రీ సాయి                  ||షిర్డి||

రేయి పగలు నీ ధ్యానం నిత్యం   నీ     లీలా పఠణం
భక్తితో చేయండి  ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణమని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి                           ||షిర్డి||

వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ  సాయీశా
కరుణామూర్తి ఓసాయి కరుణతో మము దరిచేర్చు
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో  సాయి ధ్యానం చేయాలండీ ప్రతి నిత్యం                   ||షిర్డి||

బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాది
సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి
మా పాపములను కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
సృష్టికి నీవేనయా మూలం సాయి మేము సేవకులం
మా మనస్సే నీ మందిరం మా పలుకులే నీ నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై                        ||షిర్డి||
ఓం శాంతిః                   ఓం శాంతిః                ఓం శాంతిః
ఓం శ్రీ సాయి రాం

Saturday 30 June 2012

గుడి కట్టలేరు.. కట్టినా మనుగడ సాధించలేరు.

"మూలాలు మర్చిపోయి, చెప్పుడు మాటలు విని వాటి ని ఆసరా చేసుకుని, మేము మాత్రమే బాబా భక్తులం, మాకు మాత్రమే సర్వం తెలుసు అనుకుని  "బంధాలను "వద్దు అనుకుని,  అవతలి వారిని గడ్డిపరక కన్నా హీనంగా చూస్తూ బాబా భక్తులం అని చాటింపు  వేసుకుంటూ , ఉత్తమ గ్రంధాలను పఠిస్తున్నామంటూ ఊదరగొట్టేవారు గుడి కట్టలేరు.. కట్టినా మనుగడ సాధించలేరు. 

మనం బాబా కంటే ఎంతమాత్రం గొప్ప కాదు, ఎక్కువ కాదు, కాని భక్తుల్లో వచ్చే తరతమ బేధాలు , హీనమైన అపహాస్యమైన చేష్టలు బాబా భక్తులను తల దించుకునేలా చేస్తాయి కాని తల ఎత్తుకునేలా కాదు. బాబా అనుంగు సహచరులకి ఉండవలసినది సహృదయత, సమానత్వం... సఛ్చీలత, భక్తి ప్రచార తత్వం. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇతరులదగ్గర మనగురించి చెడుగా చెప్పేవారు వారినోటిని అపరిశుభ్రం చేసుకుంటున్నారు . చెడు సావాసం , చెప్పుడు మాటలకు అవకాశం ఇవ్వకండి"

-సాయి బాబా పత్రిక నుండి వెలువడినవి

బాబా భక్తులు ఎదుటువారిని తమకన్నా చిన్న్నవారిచేత చులకన చేయిస్తూ, అగౌరవపరుస్తూ , అర్థం లేని మేసేజ్ ల (వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవాళ్ళని అవహేళన చేసే ప్రక్రియ దిగువ ఇవ్వబడినది..  బాబా!  మాకు అయినా కోపం రావడం లేదు వాళ్ళ అజ్ఞానాన్ని  మన్నించి వారికి విజ్ఞత ప్రసాదించు. ఎటు గాలేస్తే అటువైపు వెళ్ళె ఆరి చాపల్య మనస్థత్వాన్ని మన్నించు)  ద్వారా  అవహేళన చేస్తూ  మేము సాయి భక్తులం గుళ్ళు గోపురాలు కట్టేస్తాము అంటుంటే నవ్వు వస్తోంది. కాని ఏమి చేయలేము. వారి అజ్ఞానాన్ని మన్నించమని దేవుణ్ణి ప్రార్థించడం తప్పితే.

వైస్ ప్రెసిడెంట్ కి ఒక ఎక్జిక్యూటివ్ పంపిన messages:
  
1. Hi just reminding that we are in urgent need of receipt book so try to send it as soon as possible - EC member

Ans: hi,receipt books kept some other place will trace and send as early as possible.. no reminders please.



2. We are not bothered whether the books are where or with whom, the whole responsible of those books  belongs to your as a member (సాయి ప్రియ సత్సంగం  కుటుంబం ఇక్కడ మెంబర్ కాదు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు) of the satsang taken from of committee to collect the funds but later no information is given to the satsang committee regarding that from your side for your information . we are asking of books those who heave extra with them as the committee is need of books.. Thanks EC member.

Ans. I never ever have intention to tell about the books ... as per your earlier message i have feel my minimum responsibility  and curtsey to give answer for your inquiry.  .

*******

ఒక మాములు రిసీట్ బుక్ కి మేసేజ్ ద్వారా సాటి సాయి భక్తులు అని కూడా లేకుండా అవమానించి, ఇప్పుడు మనం ఎన్నో అనుభవాలను  కూర్చుకుని పదిలపర్చుకుని మళ్ళి దొరకని ఒక మహత్తరమీన పుస్తకం అడుగుతుంటే అంతే అవహేళన చేసే సాయి భక్తులని ఏమనాలి? మనసు బాధ పడుతోంది బంధాలు ఎందుకిలా కొడగడుతున్నాయి. చెప్పలేరా  ఎవరూ ఇది భావ్యం కాదని..??

సాయి ప్రియ సత్సంగం కుటుంబం మనసు నొచ్చుకుంది.
*****

Tuesday 22 May 2012

మీ భక్తురాల్ని దయ చూడండి సాయి..

బాబాగారిని సాదా మనసునందుంచుకుని ధ్యానించే బాబా భక్తురాలు శ్రీమతి ఉమాదేవి గారు ప్రస్థుతం నరాలు చిట్లిపోయిన కారణంగా మెదడుకు సంబంధించిన సర్జరీ నిమిత్తమై  hospital లో చికిత్స పొందుతున్నారు.. వీరు అమితమైన బాబా భక్తురాలు.

బాబా గారి ఆశీస్సులు ఆవిడకి ఉండాలని ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి రావాలని, బాబా గారిని మనఃపూర్తిగా వేడుకుంటూ .. నిన్ను శరణన్నవారిని కరుణించు తండ్రీ..

ఓం శ్రీ సాయి రాం.

Sunday 13 May 2012

ఓం సాయి.. శ్రీ సాయి


సాయినాధుని చిత్రీకరించిన విధంబు చూతము రారండో...

1. Aarti Jadli (Aaru) (udai deep jadli ) sent me this snap.


2. YOGI DARYANANI's  father Sewakram Daryanani drew & paint in 1981 in indonesia.  Its a wonderful painting of Sai Baba. Thanks for this snap. Om Sai Ram...


 


 3.This Sai Picture drawn by Mr.Rajender Bisht. This for this wonderful snap.



4.This picture  may be of interest.This is original picture coloured using photoshop.


One of very good and kind friend made it for all of you . Thanks to him to sent me this snap to share with all of you .  Om Sai Ram...

5.The attached pencil sketch titled ‘Sri Sai Baba’ was made by father of Vishal Mohla, 

‘Shri P.C. Sharma’ on 5/2/1987. He has used nickname ‘Binu’ on the
sketch. The dimensions of the original sketch are 28 cm X 40 cm. Scanned
and stitched in two instalments as scanner size was small :) Thanks Vishal to share with us this wonderful Sketch of Baba.
 




6. arun mirani created this glass painting of sai baba. glass painting is his hobby. thanks to him for this snap.


7. Sai baba's stone painting and acrylic painting made by Prerna Madan. Thanks for this wonderful job and its snap.




8, 9&10  this snaps drawn and sent by prabud dhamane








 



















11.12 &13 this snaps sent and drawing by Anu Sriram
 














Courtesy  : Face Book

అమ్మకి వందనం-సాయి మాతకి వందనం

I always consider everyday is our mother's day. But still its a special day for our mother...:)  Wishing all mothers in this world 

"Happy Mother's Day" 

Lets love your mother as much as you can. Don't forget we can see this beautiful world , Just because  of her.

Enjoy  Mother's Day with your Mother...:)

Om Sai Ram...


సాయి బాబ మనందరికోసం....


బాబా సాయి


Thursday 10 May 2012

సాయి చరణం మనకింక శరణం

సాయి భక్తులకి సాయిప్రియ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.. కేవలం  5 రోజులలో  వీక్షకుల సంఖ్య సహస్రం దాటింది. సాయి మహిమ అది. 'సాయి' అని పిలిస్తే 'ఓయి' అని పలుకుతారట. అలాగే మన బాబా భక్తులకు ఈ గురువారం, గురువుల వారం, జగద్గురువారం రోజు సాయిప్రియ కుటుంబం  ఆహ్వానం పలుకుతోంది. రండి ఈ బ్లాగుని ఫాలో అవండి ... మేము, మీరు , మనదరం కలిసి బాబా పై భక్తితో భక్తి ప్రచారం చేద్దాం. ఈ బ్లాగు అనుసంధానమైన ఫేస్ బుక్  కూడా వీక్షించండి. అందులో సభ్యులు కండి.

ఇందులో ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశం కలదు. బాబా చూపిన అపారమైన ప్రేమ, కరుణ, వారిపై మన భక్తి వెరసి అద్భుత సంఘటనలు, అనుభవాలు ఇక్కడ పంచుకొండి. సదా సాయి స్మరణే మనకి మూలంగా ఉందాము. సాయి ద్వారా పొందిన అనుభూతులు, అనుభవాలు మాతో,  బ్లాగు ప్రేక్షకులతో పంచుకొండి. ముందు ముందు ఈ అనుభవాల అనుభూతులని పుస్తకంగా ప్రచురించి ప్రతి సాయి భక్తుడికి పంచుతాము. మరి ఆలస్యమెందుకు సాయి పై మన భక్తిని చాటుదాం. భక్తిని ప్రచారం చేద్దాం. 
 ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి 



మా సాయి కుటుంబ ఉద్దేశ్యంలో అంటే మాతో సాయి.. ఒక స్నేహితుడు, అక మార్గదర్శి, తండ్రి.. మేము దేవుడు అని కాకుండా మా అనుంగు సహచరుడిగా సంభాషిస్తాం. కోపం వస్తే బాబా ఏంటిది అని కోపగిస్తాం? ఎందుకిలా చేశావు అని తిడతాము, అనందం వచ్చినరోజు ఆయనతో పాటు నృత్యం చేస్తాం. సాయి అంటే మా కుటుంబ సభ్యుడిగా అనుకుంటాం. మాతో పాటు బిర్యాని పెడతాము, అది లేనప్పుడు మాతో పాటు మజ్జిగ అన్నం పెట్టి సరిపెట్టుకోవా.. బాబా అని ప్రాధేయపడతాం. ఏది పెట్టినా ఎంతో ఆప్యాయంగా ఆరగించే మృధుస్వభావి మా కుటుంబ సభ్యుడు శ్రీ సాయి బాబా.

మీ మీ అనుభవ వివరాల తరువాత మరిన్ని అనుభవాలని మేము జత చేస్తాం. 

  ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి

సాయి చరణం మనకింక శరణం అని ప్రార్థిస్తూ....
******

ముఖ్యగమనిక: ఈ అనుభవాలను పంచుకోడంలో సాయిప్రియ కుటుంబ బంధువులకి సాయిప్రియ సత్సంగం ఆహ్వానం పలకడం లేదు. గమనించ ప్రార్థన.

సాయి ప్రియులకు, సాయి భక్తులకు, సాయి బంధువులకు, సాయి మిత్రులకు సాయిప్రియ మిత్రులకు ఇదే మా మనఃపూర్వక ఆహ్వానం., 

Wednesday 9 May 2012

గురువారం.. గురువుల వారం , సద్గురువు వారం.. జగద్గురువారం

Happy Sai Baba's Day to All!
 
 ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి

ఎందరో మహానుభావులు....

...సాయిభక్తులు.... అందరికీ వందనములు....

షిర్డీలో సాయిబాబ వారి విగ్రహాన్ని మలచిన శిల్పుల మరియూ బాబ వారి  అద్భుతమైన ఫోటోలు "మీ అందరికోసం"/" మీకోసం"   బ్లాగర్ సౌజన్యంతో.





SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOL




SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOL
Laxmibai Shinde




Swami Sri Sai Saranananda





THE FIRST ORIGINAL IDOL OF SAI BABA













PLACE WHERE BABA GAVE DARSHAN TO TALIM




రాజాధి రాజ, యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సఛ్చిదానంద సమర్ధ సధ్గురు శ్రీ సాయినాధ మహరాజ్ కీ జై.