Monday 2 July 2012

శ్రీ సాయిబాబా చాలీసా


షిరిడి వాస సాయిప్రభో  - జగతి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓసాయి కరుణించు కాపాడోయి
దర్శనమీయగ రావయ్య ముక్తికి మార్గం చూపవయా               ||షిర్డి||

కఫినీవస్త్రము ధరియించి భుజమునకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వేలిసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం                         ||షిర్డి||

చాంద్ పాటిల్ ను కులుసుకొని అతని బాదలు తీర్చితివి.
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం                    ||షిర్డి||

బాయిబా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యం కొలిచితిని
అభయమిచ్చి బ్రోవుమయా నీలో నిలిచెను శ్రీ సాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి                 ||షిర్డి||

ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ   నాశనం కాపాడి  షిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి                     ||షిర్డి||

భక్త భీమాజికి క్షయ రోగం నశించే అతని సహనం
ఊచీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్సన మిచ్చితివి
దాము కిచ్చి సంతానం కలిగించితివి  సంతోషం                          ||షిర్డి||

కరుణసింధూ   కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నేను మేఘా తెలుసుకొని అతని బాధ
దాల్చి శివ శంకర రూపం  - ఇచ్చావయ్యా దర్శనము                  ||షిర్డి||

డాక్టరుకు నీవు రామునిగా బల్వంత్ కు నీవు దత్తునిగా
నిమోనుకర్ కు  మారుతిగా చిదంబరం కు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా గణుకు సత్యదేవునిగా
నరసింహ స్వామిగా జోషి కి దర్శనమిచ్చిన శ్రీ సాయి                  ||షిర్డి||

రేయి పగలు నీ ధ్యానం నిత్యం   నీ     లీలా పఠణం
భక్తితో చేయండి  ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణమని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి                           ||షిర్డి||

వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ  సాయీశా
కరుణామూర్తి ఓసాయి కరుణతో మము దరిచేర్చు
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో  సాయి ధ్యానం చేయాలండీ ప్రతి నిత్యం                   ||షిర్డి||

బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాది
సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి
మా పాపములను కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
సృష్టికి నీవేనయా మూలం సాయి మేము సేవకులం
మా మనస్సే నీ మందిరం మా పలుకులే నీ నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై                        ||షిర్డి||
ఓం శాంతిః                   ఓం శాంతిః                ఓం శాంతిః
ఓం శ్రీ సాయి రాం