Saturday 5 May 2012

సత్స౦గ౦-సాయి పలుకులు






శ్రీ షిర్డీ సాయి పలుకులు:  “ము౦దు ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను.ఇక రాబోయే జన్మలన్ని౦టిలోనూ మీతో ఉ౦డగలను. మన౦ మళ్ళీ మళ్ళీ కలుసుకు౦టాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు, నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి.”
______________________

బాబాగారి ఈ పలుకులు మనమందరం గుర్తుపెట్టుకోవాలి.. భేషజాలకు పోయి... మీతో మాట్లాడాల్సిన అవసరం మాకులేదనో, మీకు చెప్పాల్సిన అవసరం మాకేంటనో, మేము మాత్రమే భక్తులమనో ... మామూలు మనుషుల్లా చెప్పుడు మాటలు విని ద్వేషాలు, కోపాలు పెంచుకుని మాట్లాడడాలు మానేసి.....మళ్ళీ వాళ్ళే నలుగురిముందు 'శాంతి, శాంతీ'  అంటూ నీతులు చెప్తున్నారు రాజకీయనాయకుల్లా.. మా  సర్కిల్ లో ఇలాంటివాళ్ళని చాలా మందిని చూశాము ముందు అలాంటి మనస్థత్వాలని మార్చండి ఇలాంటి సత్సంగాల ద్వారా... అప్పుడు మనమనుకున్న మన సంకల్పం నెరవేరుతుంది...

"మన౦ సత్స౦గ౦లో కూర్చున్న తరువాత ఏక మనసుతో ఉ౦డాలి. ’నేను”అన్న భావనను మరిచి,’అ౦దర౦” అన్న భావన పూర్తిగా మన మనసులలోకి రావాలి. అపుడు అ౦దరు కలిపి ఒక వ్యక్తి అవుతారు. అ౦టే ఏక వ్యక్తిత్వ౦గా సత్స౦గ౦ ఏర్పడుతు౦ది. "
___________________________________________
(మీ ఇల్లే కాదు మా ఇల్లు కూడా, మీ ఇంట్లో దేవుడేకాదు మా దేవుడే, ఇది మాత్రమే దేవాలయం, మా వాళ్ళు ప్రేమతో చేస్తారు....  ) అనే సంకుచిత స్వభావం నుండి మారి మీరు రాసినట్లుగా "మన " అనే భావన రావాలని మేము కూడా మీతో పాటు ఆ బాబాగారిని ప్రార్థిస్తున్నాము.