Monday 7 May 2012

అద్భుతమైన అనుభవం -అత్యద్భుతమైన రోజు

పరమం పవిత్రం బాబా విభూథిం
పరమం విచిత్రం లీలా విభూథిం. 
పరమార్థ ఇష్టార్థ మోక్ష ఫ్రధానం. 
బాబా విభూథిం ఇదమాశ్రయామి. 
సాయి బాబా విభూథిం ఇదమాశ్రయామి “


ఓం సాయి నమో నమః  శ్రీ సాయి నమో నమః  జయ జయ సాయి నమో నమః  సద్గురు సాయి నమో నమః

నిజానికి ఈరోజు గురించి ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమక పడుతూ ఇలా సాయి ఫోటోలు అవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. పదాలకి మాటలకి అందని అద్భ్తమైన అనుభూతిని ఇచ్చిన ఈరోజు గురించి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే నా మనసులోని భక్తి అనే ఆ భావం నేను అనుకున్నట్లుగా మీకు చేరుతుంది? అసలు పూజ అంటే ఏంటో తెలియని వాళ్ళం దీపం మాత్రం పెడితే పూజ అయిపోతుంది అనుకునేవాళ్ళం, మరి మా కుటుబాన్ని ఆ బాబా ఎందుకు కరుణించాడు? ఏమో! పోని జరిగి రెండు సంవత్సారాలయింది కుప్పలు తెప్పలుగా ఐశ్వర్యమిచ్చేసి, ఐశ్వర్యవంతులని చేశాడా లేదు, ఇంకా ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. కష్టం అంటే ఇదీ అని చెప్తునే ఉన్నాడు, ఆ కష్టాన్ని అవలీలగా దాటే అవకాశమూ ఇస్తున్నాడు, అవమానం అంటే ఏంటో కూడా చెప్పాడు, అనుభవించమన్నాడు. ఆత్మాభిమానం దెబ్బతినడం ఎనటో అనుభవ పాఠం నేర్పాడు, ఒడి దుడుకుల మధ్య ఉన్న మమ్మల్ని ఇంకా ఆటుపోట్లు వెన్నంటే ఉన్నాయి. మరి ఎందుకు మా కుటుంబానికి తన ఉనికి చాటాడు? దేవుడు అంటే కనిపించని శక్తి అనుకునే మాకు కాదు నేనే అంటూ ఎందుకు తెలియజేశాడు?  మేమెలాగు ఆర్భాటమగా పూజ చేయలేమనా? మాకేలాగు అన్నదానం చేసే శక్తి లేదనా? లేకపొతే మీ బంధువుల దగ్గర నీ స్థానం ఇంతే అని చెప్పడానికా? ఇందులో దేనికోసం? ఎందుకోసం తన ఉనికిని మా కుటుంబానికి తెలియపర్చారు? 


ఇప్పటికి ఎప్పటికి ఇవి జవాబు లేని ప్రశ్నలే.. కాని ఒక్కటి మటుకు అనుభవంలోకి వచ్చింది, అందరిమధ్యలో నా స్థానం , నా కుటుంబ స్థానం. ముఖ్యంగా గాలి ఎటు వైపు వీచితే అటువైపు తిరిగిపోయే మనస్థత్వాలు ఇవన్ని మా కుటుంబానికి తెలిసాయి. ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నామెమో అనేంతగా బంధువుల అవహేళనలు, ఆక్షేపణలు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. అయినా ఈరోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అత్యద్భుతమైన రోజు. కేవలం మాకే.  మా కుటుంబం చేసుకున్న అదృష్ఠం ఈ రోజు. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న ఈరోజు గురించి నెనెంత రాసినా తక్కువే. ఏమి చేద్దాం ఈ ప్రత్యేకమైన రోజు అని మా కుటుంబం తో కూర్చుని చర్చించుకుంటే, మనమేమి చేయగలము? ఆయనని స్థుతించడం తప్ప, అని అనుకున్నాము, ఆర్భటాలు, అన్నదానాలు ఆయనకి తృప్తి నిచ్చేవే అయినా మాకంత స్థోమత లేక అభిషేకం, అర్చన చేద్దామని నిశ్చయించుకున్నాము. తెల్లవారుఝామున 4 గంటలనుండే మొదలెడదామని మా నిర్ణయం. "సబ్ కా మాలిక్ ఈశ్వర్ ' అనే బాబా ఈశ్వర్ కి మేమేమి చేయగలము? "శివ శివ  బాబా శంకరా,, భక్తవ బాబాశంకరా శంభో హర హర బాబా నమో నమో" అని అనడం మాత్రమే ప్రస్థుతం తెలిసినవాళ్ళము. 

సరిగ్గా రెండు సంవత్సారల క్రితం మా కుటుంబంలో  జరిగిన ఈ అత్యద్భుత సంఘటన


08-05-2010: వీభూదితో సాయిబాబా  ప్రత్యక్షం... విబూధితో కుటుంబ పెద్ద  పూజ చేసుకున్నారని అనుకుని, పనమ్మాయికి గిన్నెలు వేద్దామనుకుంటూ,  పైన అమ్మవారిపటం మీద రోజు వారిగా చదివే శ్లోకం గంగా భవాని, గాయత్రి శ్లోకం చదువుతూ యధాలాపంగా కింద చూసేసరికి ఎర్రటి అక్షరాలు తిరగేసి రాసి ఉండడం.. భయంతో ముందు దగ్గర్లో ఉన్న బంధువులకి ఫొన్ ఆ తరువాత దూరం వారికి....అలా అలా..మొదలయింది ఆరోజు.

ఆ అక్షరాల సారాంశం: శ్రద్ధ వీబూధి నవవిధభక్తి 11/- సమర్పించండి   మీ కోరికలు తీరతాయి, ఈ ప్రదేశం బాగుంది

ఇంతేనా. అని అనుకోకండి చెప్పాము కదా!  మాకు ఇంతకన్నా వర్ణించడం రావడంలేదు. పదాలు అక్షరాలు మూగబోయాయి 
*****