Monday 14 October 2013

ఓం సాయి.. శ్రీ సాయి... జయ జయ సాయి





ఇక్కడ మీరందరూ చూస్తున్న సాయిబాబా వారి తేనే మహత్యం  చెన్నయ్ లోనిది.. ఇదే విధంగా హైదరాబాదులో 2010 మే 8 నుండి 2011 నవంబర్ 18 దాకా ఎన్నో ఎన్నెన్నో సాయిబాబా వారి అత్యంత అద్భుత లీలలు సాయిబాబా సత్సంగం సభ్యులు తమ కళ్ళారా చూసి,  సాయి బాబా ఉనినికిని కాంచి జన్మ ధన్యం చేసుకున్నారు. వీటిల్లో కొన్నిటిని మాత్రమే ఫోటోలా ద్వారా సాయి భక్తులకు  తెలియజేసే అవకాశం ఉంది కాని, ఇలా ఏ ఒక్క అద్భుతాన్ని వీడియో తీయేలేకపోయారు సాయిప్రియ సత్సంగం వారు. కారణం.. కొన్నిసార్లు ఆశ్చర్యం, కొన్నిసార్లు ఆనందం, మరికొన్ని సార్లు ఏమి చెయాలో తెలియక  నిశ్చే ష్ఠులవడం.. ఇలా చాలా పరిస్థితులు  ఏమి చేయలేని అచేతన స్థితిని కలిగించడం వల్ల నమ్మిన మనసుకు మాత్రమే  తెలిసిన చాలా అద్బుతాలను నమ్మకమయిన మనసు ఉన్న సాయి భక్తులకు, ఒక్కొక్కటిగా వివరించాలని సాయిప్రియ సత్సంగం ఆరాటం. ఇక ఆపై అంతా  సాయి ఇఛ్ఛ.