Thursday 24 October 2013

సాయిప్రియ ఎవరు?


సాయి భవసాగర జీవన యాత్ర రాస్తున్న  నేను ముందుగా అసలు నేనెవరు అన్నది బ్లాగు లోకానికి, అటు ముఖపుస్తక పరిఛయస్థులకి తెలపాలని ఈ పోస్ట్. 

"నేను.."  మహా మహులకే తెలియలేదు "నేను" అంటే ఏమిటో మాములు మానవమాత్రురాలను నేనెమి చెప్పగలను? అయినా తప్పదు చెప్పాలి. సాయి ప్రియ నా అసలు పేరు కాదు. సాయి బాబాని  అత్యంత ఎక్కువగా ఇష్టపడతాను, కొలుస్తాను  కాబట్టి నన్ను నేను సాయి ప్రియ గా మార్చుకున్నాను. 2010 వరకు నేను మీ అందరిలాగా మాములుగానే ఉన్నాను. రోజు వారి పూజలు, కార్యక్రమాలతో సందడి సందడిగా.. మరి నన్నెందుకు మార్చుకోవాకున్నారో ఆ సాయినాధుడు తెలియదు కాని నేను ఆ సాయినాధుని అత్యంత ఇష్ట దైవముగా కొలిచే ప్రియని అయ్యాను అలా నేను సాయి ప్రియని. అంతే కాని నాలో ప్రత్యేకమంటూ ఏమి లేదు. ఇది నా పేరు చెరిత్ర.

ఇక నా చరిత్ర.. అందరి లాగే అమ్మా, నాన్నా అక్క,చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నదాన్ని. నాకు ఒక కుటుంబం ఉంది, నా బాధ్యతలు నాకున్నాయి అయినా సాయి మీద ఉన్న నా భక్తి ఏదో చెయ్యాలి, సాయి బాబా భక్తి తత్వాన్ని ప్రచారం చేయాలి అన్నఆరాటం  నాదిఏమి చెప్పాలి మీ అందరికి? ఎలా చెప్పాలి, మాటలకందని ఆ మహిమలని ఎలా మీ ముందుకు తీసుకురావాలి .. నమ్మనివాళ్ళు పరోక్షంగా ఒక్క మాట అన్నా బాధే కదా! మరి  ఎలా మీరందరూ నమ్ముతారు.. ఎలా? నాకే తెలీదు.. నేను ఒకప్పుడు మీ అందరిలా ఇవన్ని మనం నమ్మాలా? మనకెందుకు? అని వదిలేసిన దాన్నే కాని ఆ తరువాత మరి నాకెందుకీ ఉనికి నిరూపణలు జరిగాయో నాకు తెలీదు కాని నేను మారాను. మిమ్మల్నెవర్ని నేను మారమని అడగడం లేదు. దయచేసి గుర్తు పెట్టుకొండి, నేనెవరిని బాబా ని నమ్మండనో నా ప్రియ దైవం బాబా కాబట్టి మీరు కూడా కొలవండనో నేను చెప్పడం లేదు. నాకు జరిగిన అనుభవాలు, అద్భుతాలు సాటి భక్తులకు పంచుదామనే నా ఆకాంక్ష అందుకే ఫేస్ బుక్ లో సాయిప్రియ సత్సంగం పేరిట ఒక పేజ్ తెరిచాము. మాకున్న ఆత్మవిశ్వాసానికి సాయి బాబా పై ఉన్న నమ్మకాన్ని జోడించి ప్రతి ఒక్క సంఘటన మీ అందరి ముందు కళ్ళకి కట్టినట్లుగా ఉంచాలన్న ఆలోచన... ప్రేరణ..  ఈ సత్సంగం పేజ్. అందుకే ఇది దేవాలయం అయింది. దీనికి ఏ ప్రతిఫలాపేక్షా లేదు. మీరు మేము మనందరం.. సాయి భక్తులం అదొక్కటే మా ఆలంబన. 

అందుకే ప్రత్యేకంగా సాయి భక్తులను, సాయి నామం జపించేవారిని ఫేస్ బుక్ లో తీసుకున్నాము. చాలా మంది ఫ్రండ్ రిక్వస్ట్‌లు పంపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికి నేను చెప్పేది ఏమిటంటే, నేను ఫేస్ బుక్ కి కాని,  బ్లాగులకి కాని కొత్త కాదు. నా సొంత పేరుతో నాకో బ్లాగు ఉంది.. సాయి ప్రియ అనగానే ఏదో కాలేజ్ గర్ల్ అనుకుంటున్నారు. సారి ఫ్రండ్స్ !  నేను మధ్యవయసులో ఉన్న మహిళని, 40 లో ఉన్నాను. కాలేజ్ కి వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా అధ్యాత్మికతను , బాబా పై నా భక్తిని,   నన్ను నేను తెలుసుకోవాలనే ఈ ఫేస్బుక్. కాబట్టి నాకు ఫ్రండ్ రిక్వస్ట్ పంపేవాళ్ళకి కొంచం ఆలోచించుకుని పంపండి ప్లీజ్. ఇక మరొక్క మాట నేను ఎవరితో చాట్ చేయను. తప్పుగా భావించవద్దు. బాబా గురించి అయితే నేను ఆయన సేవకురాలిని కాబట్టి ఆయన గురించి నేనెప్పుడు చేతులు కట్టుకుని నిలబడతాను. 

భవిష్యత్తులో మన సాయి సత్సంగం వారిచే, ఒక ఆశ్రమం కట్టబడాలని, నా వయసువాళ్ళందరు అక్కడ విశ్రాంత జీవనం గడపాలని నాదోక ఆలోచన చూద్దాము అంతా సాయి ఆజ్ఞ.


సాయిప్రియ సత్సంగం లోకి అడుగు పెట్టేవాళ్ళు  ఎవరయినా పర్వాలేదు యువతులు, యువకులు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవారు చిన్నవారు అందరూ సాయి బాబాను తలుచుకుని మనస్ఫూర్తిగా మీ మదిలోని కోరికను నెరవేర్చమని ఆ బాబాని కోరుకుంటూ సత్సంగం పేజ్లోకి కాని, సాయిప్రియ ముఖపుస్తకంలోకి కాని కుడి చేత్తో మొదలు పెట్టండి. నేను, నా ఫేస్ బుక్ నా పేజ్ అని నేను అనడం లేదు "నా" , "నేను" అన్న మాటలు మర్చిపోయాము. మన ఫేస్ బుక్, మన పేజ్ అది. అందుకే మీరందరు  బాబాని తలుచుకుని సాయిప్రియ సత్సంగం  కి ఒకే ఒక్క లైక్.. ఇవ్వండి చాలు. మీ జీవితాలు సంతోషమయమవుతాయి అక్కడి ఆధ్యాత్మికతతో  ఇంతకన్నా ఏమి చెప్పలేను.

మీ అందరికి ఇదే మా సత్సంగ ఆహ్వానం. ఒక్కనిముషం...



అరెరె.. అంత కోపం వద్దండి.. మా కోసం కాదు బాబా కోసమన్నమాట..మన సాటి సాయి భక్తుల కోసం   :)



ఓం శ్రీ సాయి రాం.