Thursday 24 October 2013

సాయి జీవన యాత్ర 24-10-2013

పొద్దున్న సాయి ప్రియ ఎవరు?   అంటు ఒక పోస్ట్ రాసాను కదా ఇంక ఈరోజుకి వద్దు అనుకున్నాను కాని బాబా తన స్మరణని అలా చేస్తూనే ఉండాలి అని నా మనసుకి అజ్ఞాపించాడేమో మరి,, బాబా పాదాలు వదలడం లేదు నా మనసు అందులో ఈరోజు మరి మన సాయినాధునికి ఇష్టమైన రోజు... గురువారం, బాబా వారం అందుకే మరి ఈరోజు ఆయనకి ఇంత చక్కగా గడపగలిగినందుకు ధన్యవాధాలు అర్పొఇద్దామని ఈ పోస్ట్. మరి చెప్పేముందు ఒక్కసారి వారిద్వార జరిగిన మరొక అద్భుతమైన అనుభవమొకటి అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్లుగా జ్ఞప్తికి తెచ్చుకుందామా?

ఆత్మ దర్శనం.. ఆత్మలు ఉన్నాయా? మనచుట్టూ తిరుగుతాయా లాంటి పెద్ద ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేము కాని.. ఈ అనుభవాన్ని మేము మాటల్లో పొదగలేము. సాయి మహిమని ఎంతని చెప్పగలము.. సాయి ప్రియ సత్సంగం ఏర్పడకముందు సాయిప్రియ కి సంబంధించిన సభ్యులందరూ సాయి పారాయణని భక్తితో చేద్దామని తలచి.. ఎంతో నిష్టగా సప్తాహం చేసారు.. ప్రతిరోజు ఆతరువాత రోజు పారయణలో వచ్చే సన్నివేశాలను బాబా ఏదో ఒక రూపేణా పారాయణం చేసేవారి కళ్ళముందు ఉంచడం ఒక మరుపురాని అద్బుతమైతే.. ఆరోజు సాయి ప్రియ కి ఒకే ఒక సందేశం.. మొదట అర్థం కాలేదు కాని తరువాత తరువాత మనసు అదుపులో పెట్టడం కష్టమయింది. సాయిప్రియ కి వచ్చిన ఆ అద్భుతమైన సందేశం: బాబా అంటే ఆరడుగుల మానవాకారం కాదు ఏదో ఒక రూపంలో ఎక్కడయినా ఉండొచ్చు. అన్నిటిలో బాబా ని కొలవండి.. రేపు మీకు ఆత్మ దర్శనం కలుగుతుంది.."

ఆత్మ దర్శనమా అంటే.. ఏమో మరి మాకేమి తెలుసు? ఎలా ఉంటుంది? బాబా ఎలా వస్తారు? ఏ రూపేణా వస్తారు ఎవరికి అంతుబట్టడం లేదు సాయిప్రియకి అసలు అర్థమే తెలీదు మరి ఏవిధంగా వర్ణించగలము? మర్నాడు అంటే జులై 17 పారాయణ ఆఖరి రోజు అంటే ఏడో రోజు  ఆరోజె వారి బంధువుల కుమారులకి  అక్షరాభ్యాసం , సాయి వ్రతం మొదలైన కార్యక్రమాలు , ఇంటి ముందు మంగళ వాయిద్యాలు, ఇంట్లో పూజలు  అంతా హడావిడి పిల్లలు పెద్దలు భక్తి పారవశ్యంలో పూజలు చేస్తున్నారు.. ఈ ఆనందాన్ని తమ కెమెరాల్లో భందిద్దామని  మరికొందరి ఆరాటం.. అలా సాయి వ్రతానికి ముందు  తీసిన ఒక ఫోటో లో ఆత్మ దర్శనం. ఎంత అద్భుతం ఒక మానవుని గొంతు నుండి మనసు దాక  ఎన్ని చిత్రాలు నిక్షిప్తం  చేయచ్చో కళ్ళకి కట్టినట్లుగా ఎంతో చక్కగా ఒక వృత్తాకరంలో ఒకవైపు శివుడు, మరో వైపు సాయినాధుడు ఇంకోవైపు నరసింహస్వామి అలా అందరు కొలువై ఉన్నట్లుగా అద్భుతం గోచరించింది ఆ ఫోటోలో.. శ్రీ కృష్ణ భగవానుడు యశోదకి తన నోటిలోనే  విశ్వాన్ని చూపించినట్లు ఆ సాయినాధుడు ఒక మానవునిలో తన విశ్వరూపాన్నిచూపించాడు.. నమ్మకంతో మన మనో నేత్రంతో చూస్తే మనం కోరుకునే భగవంతుడు కనిపించే ఆత్మదర్శనమది. అదోక అద్భుతం సాయిప్రియ సత్సంగం ఎంతటి పుణ్యం చేసుకుంటే ఆ అదృష్టం కలుగుతుంది. దీనిని మాటలలో వర్ణించగలమా? 

ఆత్మ దర్శనం అందరికి చూపించడానికి మాకు బాబా అనుమతి లేదు కాబట్టి మాకు కలిగిన ఆ సదవకాశాన్ని కొంతలో కొంతగా మీ అందరికీ చూపిస్తాము. ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నవారు సాయిప్రియ సత్సంగానికి ఒక లేఖ రాయండి  తప్పక ఆ సదవకాశాన్ని కలుగజేస్తాము. ఇదొక అత్యద్భుతమైన సాయిబాబా ఉనికి.
మా అడ్రస్:saipriyasatsangam@gmail.com
ఈ అడ్రస్ కి మీరొక మెయిల్ చేసే ముందుగా,  మీకు రోజు విన్నవించుకున్నట్లుగానే మరి మన సాయిప్రియ సత్సంగం కి ఒక చిన్న "లైక్" ... మరిచిపోరుగా...:-)  
ఓం శ్రీ సాయి రాం