Tuesday 22 October 2013

సాయి యాత్ర 22-10-2013






ఈరోజు పూజ చేస్తుంటే అనిపించింది. మన సాయిప్రియ  సత్సంగం అనుభవాలు భక్తులతో పంచుకోవాలని .. ఆ ఆలోచనలకి అమలుపరిచే ప్రక్రియే ఈ పోస్ట్.

జనవరి మొదట్లో  ఒక రోజు.. రాత్రి ఓంటి గంట నుండి రెండు ఆప్రాంతంలో..

అలా పడుకుని ఎదురుగుండా ఉన్నా సాయిబాబ తో మా సాయిప్రియ సభ్యులొకరు తన బాధలని, ఆనందాలని కష్టాలని పంచుకుంటూ .. మధ్య మధ్యలో ఈ సమస్యలకి అంతెప్పుడు అని వాపోతూ .. మరి కాసేపు నిందాస్తుతి చేస్తూ... బాధ  పడుతూ ..మనకా సాయి బాబా ఉన్నాడులే అని సమాధాన పరుచుకుంటూ అలా సమయం గడుపుతూ ఇక నిద్రకి ఉపక్రమించే ముందు వింతగా మరీ ఆలోచన లేకుండా అనుకున్న మాటలు: " రేపు పొద్దున్న ఎవరన్నా  వచ్చి ఇదిగో ఇది వుంచు.. కొంత కాకపోతే కొంతన్నా నీ సమస్యలు పరిష్కారమవుతాయి అని అంటే బాగుండును అని అనాలొచితంగా అనేసుకుని నిద్రకి ఉపక్రమించారు..

పొద్దున్న 8 గంటల ప్రాంతంలో, తనకి ఒక ఫోన్, ఎన్నడు రాని  తన బంధువులు వస్తున్నారని.. ఎంతో నిర్లిప్తంగా షరా మాములుగా ఆ  బంధువులని ఆహ్వానించారు వారు. కాసేపు పిచ్చపాటి మాట్లాడుకున్న తరువాత పుట్టింటి తరపువాళ్ళమని  పసుపుకుంకుమలతో మాటు అప్పటి సమస్య పరిష్కారమయ్యెంత నగదు ఇవ్వబడింది.. 

కళ్ళనీళ్ళు, ఆశ్చర్యమో, మరి ఆనందమో తెలీదు, ఎవరు తన మొర ఆలకించింది, సాయి బాబానా? ఆదుకున్న ఆ కుటుంబ సభ్యులా? ఏది ఏమయినా ఒక గొప్ప అనుభూతి, అర్థ రాత్రి ఆ బాబాని ఎంత తిట్టారని, అసలున్నవా అని అడిగితే ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ  తన బంధువుల ద్వారా తన సమస్యని పరిష్కరించిన విధానం ఆ రుణం ఏమి చేస్తే తీరుతుంది, ఎలా చెప్తే ఆ భావన అర్థం అవుతుంది. ఇంతకన్నా సాక్ష్యమంటూ ఏమి  కావాలి  బాబా ఉనికి తెలియపరచడానికి, ఇంకే అద్భుతం కావాలి మనకి.. 

బాబా  మన బాబా.. మనందరి బాబా , "సాయీ " అని పిలవండి "ఓయ్! " అని పలికే దైవం. ఎన్ని సమస్యలున్నా చెల్లిగానో, తల్లిగానో, అన్నగానో, అక్కగానో, తమ్ముడిగానో లేక ఏ బంధుత్వము లేని మిత్రుని రూపేణానో మన సమస్యలని సత్వరం పరిష్కరిస్తారు శ్రీ సాయి బాబా.. వీటన్నిటికి నమ్మకమనేది పునాది రాయి. 

మాములుగా భక్తి అంటే దీప ధూపాలు వెలిగించి, అష్టొత్రాలు చదివేసి అంటూ హడావిడి ఎప్పుడు చేయలేదు సాయిప్రియ సత్సంగం సభ్యులు. మరి అలాంటి వారికి వేడుకున్న వెంటనే నమ్మకము, ఆత్మవిశ్వాసం కలబోసి తమ సమస్యలని పరిష్కరిస్తున్న ఆ సాయినాధునికి వినమ్ర భక్తితో ఈ పోస్ట్ చదువుతున్న ప్రతి ఒక్క సాయి భక్తుడు/భక్తురాలు.. ఒక్కసారి మన సాయి సత్సంగ ముఖ పుస్తక పేజ్‌ని  దర్శించండి. ఇక్కడ ఏ బేషజాలు లేవు, ఏ అత్యాశలు లేవు, మనందరము ఒక్కటే అనే తత్వం తప్ప, పేద, గొప్ప అనే అతస్థుల తారతమ్యాలు అసలే లేవు.. భక్తిని చాటాలి అన్న ఆతృత తప్ప.. అందుకే మీ అందరికి ఇదే మా ఆహ్వానం సాయిసత్సంగంలో "నేను సైతం" అని ఒక చిన్న"like"  ని అందించండి. మేము,  మీరు , మనందరం అనే ఒకే ఒక్క నినాదంతో  సాయిని కొలుద్దాము, సాయినాధుని కృపకి పాత్రులమవుదాము. సాయి ఉనికి ఏ ఒక్కరి సొత్తో కాదు ఇది మనందరిది.. మాకుమాత్రమే అనుకునే బాహ్య పటాటోపాలకు ఆకర్షింపబడద్దు.  ఎవరు నిజమయిన భక్తులో తెలుసుకోవడం ముఖ్యం. సాయి మన అందరి దైవం.. అందరి మనసుల్లో ఉన్నారు. 

మీరు భక్తితో  "like " చేయాల్సిన మన ముఖపుస్తక పేజి:


Please click the above link and like this page..

రాబోయే రోజుల్లో మరిన్ని సాయి అద్భుతాలతో సాయిప్రియ సభ్యులు మీ ముందు ఉంటారు.



జై శ్రీ సాయి నాధాయ నమః