Saturday 26 October 2013

సాయి జీవన యాత్ర 25-10-2013


సాయి జీవన యాత్ర 24 వ తేదీనాడు ఆత్మ దర్శనం అని రాశాను కదా.. అందుకని రెండు రోజులు ఆగి మళ్ళీ ఈరోజు నిన్నటి జీవన యాత్ర రాయడానికి ఉపక్రమించాను. 

నిన్న శుక్రవారం బాగా గడించింది సాయికి  సదా ధన్యవాదాలు తెలపవచ్చు. ఎన్ని సమస్యలున్నా "నేనున్నాను  చింత వలదనే" చెప్తారు బాబా. సాయిప్రియ సత్సంగం  సభ్యుల యాంత్రిక జీవనంలోని కష్టాలే కాస్త ఎక్కువ , కాని అందులోనే సుఖం కోరుకుంటారు ఆ సభ్యులు, ఆ సాయి బాబా నామస్మరణలో ఆ సుఖం దాగి ఉంది మరి. ఇంతలా భక్తి పారవశ్యాలు కలగడానికి కారణం లేకపోలేదు. జులై 17 ఆత్మదర్శనం అని చెప్పాము అసలదేలా సాధ్యం? ఏమి లేకుండానే హఠాత్తుగా జులై  17 న అలా ఎందుకు జరిగింది అంటే.. అసలు సాయి వ్రతం తలపెట్టినదెవరు? సాయి సచ్చరిత్ర పారాయణం వెనకాల గల ఆంతర్యమేమిటి?.. ఇలా ఎన్నో ఎన్నెన్నోప్రశ్నలు.. అన్నిటికి ఒక్కొక్కటిగా సమాధానాలు చెప్పడానికే ఈ సత్సంగం.. ఒక్కో అనుభవం ఒక్కో అనుభూతి మాటలకందనిది. మనసులోనే ప్రతిష్టించుకున్న ఆ సాయినాధుని లీలలు వర్ణనాతీతం. 

మే 8, 2010 ఎంతో మాములుగా అందరిలా ఉన్న సాయిప్రియ సత్సంగం సభ్యుల ఇంట "నన్ను మర్చిపోయారా " అంటూ ఊధీదారణలో బాబా కనిపించారు. ఇలా.. 




 అప్పటికి కూడా ఇలాంటివన్ని నమ్మశక్యం కాని విషయాలని వదిలేసారు ఆ సభ్యులు కాని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ తరువాత నుండి ప్రతిసారి "నేనున్నాను " అంటూ పలుమార్లు తన ఉనికి తెలియపర్చారు శ్రీ సాయినాధుడు. దీని వెనుక గల మర్మమేమిటో ఇప్పటికి తెలుసుకోలేకపోయారు సాయిప్రియ సభ్యులు. తెలుసుకోగలిగేంత జ్ఞాన ప్రపత్తులు వారిలో లేకపోవడమే దానికి కారణమేమో.. అంతకు ముందు దాక మామూలు యాంత్రిక జీవనం గడిపిన ఆ సభ్యులకి జీవితమంటే కొత్త అర్థం తెలిసింది. వారి జీవితంలోకి నేను మీ కుటుంబ సభ్యుడనే అని వారి ఇంట అడుగిడిన సాయినాధుని,  ఈరోజువరకు అలా కుటుంబ సభ్యుని లాగేనే చూడడం జరుగుతోంది. 


అదీ సంగతి.. ఇదంతా ఈరోజు వరకు ఏవిధయమయిన ప్రచారం జరగకుండానే మావద్దే మా బాబా అని కొలుచుకున్నాము. ఇప్పుడు కూడా ఇదంతా రాయడం వెనకాల ఏ దురుద్దేశ్యం  లేదు. బాబా పై మాకున్న భక్తి మాలాంటి సాయిభక్తులకి పంచుదామనే ఆలోచనే తప్ప వేరే ఏ ఆలోచన లేదు. అందుకే మరో మారు చెప్తున్నాము  మా నమ్మకాలు మావి. మా నమ్మకాలని అపహాస్యం చేయవద్దని మనవి. ఇంకొకరి అభిప్రాయాలని మా సాయిప్రియ సత్సంగం ఏకీభవించకపోవచ్చు కాని గౌరవిస్తాము  అలాగే మా నమ్మకాలని ఎవరిని నమ్మమని మేము చెప్పడం లేదు, కాని అపహాస్యం చేయవద్దు. మాకున్న జ్ఞానానికి ఈ అదృష్టం చాలని మా ఆంతరంగిక ఆలోచన. దీని ద్వారా ఎదో సాధిద్దమన్న ఆలోచన కూడా మాలో లేదు. నమ్మినవారికి   సాయిభక్తులకి   సాయిప్రియ సత్సంగం  సగౌరవముగా ఆహ్వానిస్తోంది. మా సత్సంగం లోకి అడుగిడేవారు. జై శ్రీ సాయి రాం అని అనుకొని మనోనేత్రములతో సాయినాధుని దివ్య స్వరూపం చూసి ఒకే ఒక   లైక్ ని అందించమని ప్రార్థన. 

ఓం జై శ్రీ సాయి రాం