Monday 21 October 2013

సాయి యాత్ర 21-10-2013





21-10-2013 సోమవారం: ఈరోజు బాబాకి అమ్మవారికి అభిషేకం  అయింది. అభిషేకం చేస్తూ  మంత్రాలు చదవడం కన్నా,  ఆ కాసేపు అలా వారిద్దరితో ఎన్నో ఎన్నెన్నోఅ కబుర్లు చెప్తూ గడిపాము. ఏమి చెయ్యాలి మరి .. ఈ సాయి సత్సంగం వాళ్ళ కష్టాలకు అంతం ఎప్పుడో అని అడగడమే.. ఏదన్నా ఒక ఆశయం కావాలి , ఆ ఆశయం సఫలీకృతం కావడానికి అంగబలం అర్థబలం కావాలి.. అన్ని వూన్నా ఒక్కోసారి ఆత్మవిశ్వాసం కరువవుతుంది. అందుకే వీటన్నింటినీ  చేకూర్చమని వేడుకోవడమే.. ఆత్మవిశ్వాసం ఉంది, ఆశయము ఉంది మరి.. ఇక అర్థబలం గురించే ఆలోచన అది ఉంటే అంగబలం అదే వస్తుందని మా సహ భక్తుల ఆలోచన.. అదే ప్రయత్నం..వీటన్నింటికీ  ఒక గాడ్ ఫాధర్   కావాలి.. ఎప్పుడవుతావు సాయి?   అని అడగడమే ఆ బాబాని.. :( అడిగినప్పుడల్లా ఒక చిరునవ్వు ఆయన సమాధానం అవుతోంది.. ఇక ఆ అమ్మవారేమో నాదేముంది.. ప్రయత్నం చేయండి అని సలహా.. చూడాలి ఆశయాలు నెరవేరే దారేదో..



ఈరోజుకి ఇక బాబాకి , అమ్మవారికి, మన సత్సంగం సభ్యులకు అందరికి ఓం శ్రీ శాయి రాం... మళ్ళీ బాబా తో మాట్లాడడానికి తెల్లవారుఝామున  మూడు గంటలకి.. 

సాయీ!  నిద్ర లేపేస్తావు కదూ..మరిక ఈరోజుకి సాయ్ రాం!

గోకుల సాయి  కృష్ణా  గోపాల సాయి కృష్ణా.. చేరగ  రావాయ్యా..
జై సాయి కృష్ణ, సాయి కృష్ణ,  సాయి కృష్ణ,  సాయి కృష్ణ, హరే..