బాబాగారిని సాదా మనసునందుంచుకుని ధ్యానించే బాబా భక్తురాలు శ్రీమతి ఉమాదేవి గారు ప్రస్థుతం నరాలు చిట్లిపోయిన కారణంగా మెదడుకు సంబంధించిన సర్జరీ నిమిత్తమై hospital లో చికిత్స పొందుతున్నారు.. వీరు అమితమైన బాబా భక్తురాలు.
బాబా గారి ఆశీస్సులు ఆవిడకి ఉండాలని ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి రావాలని, బాబా గారిని మనఃపూర్తిగా వేడుకుంటూ .. నిన్ను శరణన్నవారిని కరుణించు తండ్రీ..
ఓం శ్రీ సాయి రాం.
శ్రీ సాయి భక్తులందరికి, బాబా వారిని శుభాసీస్సులు అందించమని మా సాయి కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
Tuesday, 22 May 2012
Saturday, 19 May 2012
Sunday, 13 May 2012
సాయినాధుని చిత్రీకరించిన విధంబు చూతము రారండో...
1. Aarti Jadli (Aaru) (udai deep jadli ) sent me this snap.
2. YOGI DARYANANI's father Sewakram Daryanani drew & paint in 1981 in indonesia. Its a wonderful painting of Sai Baba. Thanks for this snap. Om Sai Ram...
3.This Sai Picture drawn by Mr.Rajender Bisht. This for this wonderful snap.
4.This picture may be of interest.This is original picture coloured using photoshop.
One of very good and kind friend made it for all of you . Thanks to him to sent me this snap to share with all of you . Om Sai Ram...
5.The attached pencil sketch titled ‘Sri Sai Baba’ was made by father of Vishal Mohla,
‘Shri P.C. Sharma’ on 5/2/1987. He has used nickname ‘Binu’ on the
sketch. The dimensions of the original sketch are 28 cm X 40 cm. Scanned
and stitched in two instalments as scanner size was small :) Thanks Vishal to share with us this wonderful Sketch of Baba.

6. arun mirani created this glass painting of sai baba. glass painting is his hobby. thanks to him for this snap.
7. Sai baba's stone painting and acrylic painting made by Prerna Madan. Thanks for this wonderful job and its snap.
8, 9&10 this snaps drawn and sent by prabud dhamane

11.12 &13 this snaps sent and drawing by Anu Sriram
Courtesy : Face Book
అమ్మకి వందనం-సాయి మాతకి వందనం
I
always consider everyday is our mother's day. But still its a special
day for our mother...:) Wishing all mothers in this world
"Happy
Mother's Day"
Lets love your mother as much as you can. Don't forget we
can see this beautiful world , Just because of her.
Enjoy Mother's
Day with your Mother...:)
Om Sai Ram...
Om Sai Ram...
Friday, 11 May 2012
Thursday, 10 May 2012
సాయి చరణం మనకింక శరణం
సాయి భక్తులకి సాయిప్రియ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.. కేవలం 5 రోజులలో వీక్షకుల సంఖ్య సహస్రం దాటింది. సాయి మహిమ అది. 'సాయి' అని పిలిస్తే 'ఓయి' అని పలుకుతారట. అలాగే మన బాబా భక్తులకు ఈ గురువారం, గురువుల వారం, జగద్గురువారం రోజు సాయిప్రియ కుటుంబం ఆహ్వానం పలుకుతోంది. రండి ఈ బ్లాగుని ఫాలో అవండి ... మేము, మీరు , మనదరం కలిసి బాబా పై భక్తితో భక్తి ప్రచారం చేద్దాం. ఈ బ్లాగు అనుసంధానమైన ఫేస్ బుక్ కూడా వీక్షించండి. అందులో సభ్యులు కండి.
ఇందులో ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశం కలదు. బాబా చూపిన అపారమైన ప్రేమ, కరుణ, వారిపై మన భక్తి వెరసి అద్భుత సంఘటనలు, అనుభవాలు ఇక్కడ పంచుకొండి. సదా సాయి స్మరణే మనకి మూలంగా ఉందాము. సాయి ద్వారా పొందిన అనుభూతులు, అనుభవాలు మాతో, బ్లాగు ప్రేక్షకులతో పంచుకొండి. ముందు ముందు ఈ అనుభవాల అనుభూతులని పుస్తకంగా ప్రచురించి ప్రతి సాయి భక్తుడికి పంచుతాము. మరి ఆలస్యమెందుకు సాయి పై మన భక్తిని చాటుదాం. భక్తిని ప్రచారం చేద్దాం.
ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి
మా సాయి కుటుంబ ఉద్దేశ్యంలో అంటే మాతో సాయి.. ఒక స్నేహితుడు, అక మార్గదర్శి, తండ్రి.. మేము దేవుడు అని కాకుండా మా అనుంగు సహచరుడిగా సంభాషిస్తాం. కోపం వస్తే బాబా ఏంటిది అని కోపగిస్తాం? ఎందుకిలా చేశావు అని తిడతాము, అనందం వచ్చినరోజు ఆయనతో పాటు నృత్యం చేస్తాం. సాయి అంటే మా కుటుంబ సభ్యుడిగా అనుకుంటాం. మాతో పాటు బిర్యాని పెడతాము, అది లేనప్పుడు మాతో పాటు మజ్జిగ అన్నం పెట్టి సరిపెట్టుకోవా.. బాబా అని ప్రాధేయపడతాం. ఏది పెట్టినా ఎంతో ఆప్యాయంగా ఆరగించే మృధుస్వభావి మా కుటుంబ సభ్యుడు శ్రీ సాయి బాబా.
మీ మీ అనుభవ వివరాల తరువాత మరిన్ని అనుభవాలని మేము జత చేస్తాం.
ఓం సాయి, శ్రీ సాయి , జయ జయ సాయి
సాయి చరణం మనకింక శరణం అని ప్రార్థిస్తూ....
******
ముఖ్యగమనిక: ఈ అనుభవాలను పంచుకోడంలో సాయిప్రియ కుటుంబ బంధువులకి సాయిప్రియ సత్సంగం ఆహ్వానం పలకడం లేదు. గమనించ ప్రార్థన.
సాయి ప్రియులకు, సాయి భక్తులకు, సాయి బంధువులకు, సాయి మిత్రులకు సాయిప్రియ మిత్రులకు ఇదే మా మనఃపూర్వక ఆహ్వానం.,
Wednesday, 9 May 2012
గురువారం.. గురువుల వారం , సద్గురువు వారం.. జగద్గురువారం
ఎందరో మహానుభావులు....
...సాయిభక్తులు.... అందరికీ వందనములు....
షిర్డీలో సాయిబాబ వారి విగ్రహాన్ని మలచిన శిల్పుల మరియూ బాబ వారి అద్భుతమైన ఫోటోలు "మీ అందరికోసం"/" మీకోసం" బ్లాగర్ సౌజన్యంతో.
SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOL
Swami Sri Sai Saranananda
THE FIRST ORIGINAL IDOL OF SAI BABA
PLACE WHERE BABA GAVE DARSHAN TO TALIM
షిర్డీలో సాయిబాబ వారి విగ్రహాన్ని మలచిన శిల్పుల మరియూ బాబ వారి అద్భుతమైన ఫోటోలు "మీ అందరికోసం"/" మీకోసం" బ్లాగర్ సౌజన్యంతో.
SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOL
SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOL
Laxmibai Shinde
Swami Sri Sai Saranananda
THE FIRST ORIGINAL IDOL OF SAI BABA
PLACE WHERE BABA GAVE DARSHAN TO TALIM
రాజాధి రాజ, యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సఛ్చిదానంద సమర్ధ సధ్గురు శ్రీ సాయినాధ మహరాజ్ కీ జై.
మనసు తృప్తి పడింది
సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం
తరుంకల్ప వృక్షాధి కం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||
****
08-05-2012 : ఉదయం 3 గంటలనుండే పూజ ప్రారంభించామని చెప్పాము కదా.. ఇక సాయంత్రం సాయి బాబా వ్రతం తలపెట్టుకున్నాము. మూఢం కావచ్చు మరింకేమయినా కారణం కావచ్చు, పూజారి కుదరలేదు. మేమేమి నిరుత్సాహపడలేదు. వినాయక చవితి మనం ఎలా చేసుకుంటామో అలాగే వ్రతం చేసుకుందామని నిర్ణయించుకున్నాము. మా నిర్ణయానికి అనుకూలంగా వరుణుడు మమ్మల్ని కరుణించి చినుకుల నుండి ఒక మోస్తరు వర్షం కురిపించి వాతావరణాన్ని చల్లబరచడం మాకు చాలా ఆనందమేసింది (దీపం ఉన్నప్పుడు కూలర్, ఫాన్ వాడము కదా, అందుకని వేడి వాతావరణాన్ని వరుణుడు చల్లబరిచాడని చెప్పడం) . ఇంకా చెప్పాలంటే బంధువులు వద్దు అనుకున్న మా కుటుబానికి మా పూజ తిలకించడానికి వచ్చిన అతిథి వరుణుడు. ఆనందమేసింది.
*******
సాయిబాబా
భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలూ
అక్కర్లేదు. తిధి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో
సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా
ప్రారంభించవచ్చు.
సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయి బాబా పూజకు కావలసిందల్లా భక్తిభావన.
సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక, పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చు.
సాయిబాబా చరిత్ర, సాయిబాబా లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణ చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి, బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక వారంలో పూర్తిచేయలేనివారు రెండు, లేదా మూడు వారాల్లోనూ పూర్తిచేయవచ్చు. నిత్య పారాయణ కూడా చేయవచ్చు. కానీ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం.
సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. అలాగే పారాయణ పూర్తయ్యాక రెండు రూపాయలకు తక్కువ కాకుండా బాబా ట్రస్టుకు దక్షిణ పంపాలి.
సాయిబాబా గ్రంధాలను పారాయణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.

********
teluguone సౌజన్యంతోMonday, 7 May 2012
శ్రీ సాయి భక్తులందరికి, బాబా వారిని శుభాసీస్సులు అందించమని మా సాయి కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
మా కుటుంబంలో జరిగిన ప్రత్యేక అద్భుతం మీకు ముందే విన్నవించాము. ఉదయం 3.30
గంటలనుండి పూజ మొదలుపెట్టాము. అభిషేకం, అష్టోత్తరం, అర్చన చేశాము.
మనస్ఫూర్తిగా బాబాని మన అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిద్దాం .
సాయి భావన
ఈ సాయి భావన "శ్రీ శిరిడి సాయి వ్రతకల్పము (హింది మూలం శ్రీ నిసా జానీ గారిచే రచింపబడినది) తెలుగు లొ శ్రీ కమ్మిల బాబూరావు గారిచే అనువదింపబడిన పుస్తకమునుండి గ్రహింపబడినది. మన సాయి భక్తులందరూ కూడ దీనిని ప్రతీరొజు లేదా ప్రతి గురువారము నాడు చదువుకొనవచ్చును.
సాయి భావన
1. జయ ఈశ్వర సాయి దయాళూ నీవే జగతికి పాలన కర్తవు
2. దత్త దిగంబరావతారా నీ అధీనమే సాయి ఈ జగమంతా
3. త్రిమూర్త్యవతారా శరణాగతులకు నీవే ప్రాణాధారం
4. దర్సనమీయుము ఓ ప్రభు సాయి
5. కఫినీ వస్త్రము ధరియించి, భుజముకు జోలి తగిలించి
6. నింబ వృక్షపు ఛాయలో కనిపించి, ఫకీరు వేషము ధరియించీ
7. పతితుల ఈ జగాన ఉథ్థరించుటకు, కలియుగాన అవతరించితివి
8. శిరిది గ్రామం నీవాసం, జనుల హ్రుదయాల గెలిచితివీ
9. చిలుమును చేపట్టీ మురళీమొహను రూపమయీ
10. నీ కన్నులు మాపై దయచూపూ నీ పలుకులు అమృతధారలు కురిపించూ
11. ఎక్కడ నీ థుని ఉన్నా సాయి పాపాలన్నీ మాడిపోవును
12. నేరక తప్పులు చేసితిమీ మము కరుణించీ వరమీవా సాయి
13. కరుణసింధూ ఓసాయి - నీ ద్వారమున నిలిచితిమీ
14. అగ్నిహోత్రి శాస్త్రికి దర్శనమిచ్చి మహిమ జూపితివి
15. శ్యామాను రక్షింతివి - పాము విషము తొలగించి
16. ప్రళయకాలమునాపితివి - భక్తుల భయముక్తుల చేసితివీ
17. మహమ్మరిని మాపితివి - శిరిది పురిని రక్షించితివీ
18. వందనమయ్యా ఓ సాయి - నీ చరణాలపై శిరసుంచితినీ
19. మనసున కోర్కెలు నెరవేర్చు - భవసాగరమును దాటించు
20. భక్త భీమాజీ క్షయరోగం - ఉపచారాలెన్నో చెసితివీ
21. పరమ పవిత్రం నీ ధునిఊదీ - నశియంచెను భీమాజీ క్షయరోగం
22. విఠలరూపము ధరియించీ కాకాజీకి కనిపించితివీ
23. దామూకొసగీ సంతానం - సంతుష్టునిగా చెసావూ
24. ఓ కృపాళూదయజూడుమయా - దీనదయాళూదయామయా
25. సర్వస్వం నీ కర్పించితినీ - సద్గతినిమ్మూ ఓ సాయి
26. మేఘా నీవెవరో తెలియకనయా - ముస్లిముగా భావించెనయా
27. శివశంకర రూపం ధరియించీ - ఇఛ్చావయ్యాదర్శనము
28. జలమును నూనెగ మార్చితివీ - వెలింగించావూ దివ్వెలను
29. చూసీ వింతైన ఆదృశ్యం అచ్చెరువొందెను ఆగ్రామం
30. చాంద్పటెల్ చింతించె గుర్రము దొరకక మనమున
31. సాయినీకృప వలన - గుర్రము తిరిగి లభియించె
32. శ్రథ్థ సబూరి మనమున నిలిపి - సాయి నామము తలవండీ
33. సతతము సాయిని తలచిన - మనసున కోర్కెలు ఫలియించూ
34. తాత్యా ఆపద గుర్తించీ - నీ అయువునతనికి ఇచ్చితివీ
35. బాయిజా సేవలు మెచ్చితివీ - ప్రతిఫలమామెకు ఇచ్చితివీ
36. పశుపక్షులను ప్రేమించి - ప్రేమతో వాటిని లాలించి
37. యెల్లర సమముగ చూసితివీ - స్వయముగ సేవలు చేసితివీ
38. నీ శరణన్న వారలను - నీ వారిగ భావించితివి
39. పదకొండూ నీ వచనాలూ - భక్తులకొసగిన వరాలూ
40. అణువణువున నీవే ఓ సాయి - నీ లీలలు బహుచిత్రమయా
41. ఏరీతిగ నీగుణగానము గావింతూ - బుథ్థిహీనుడనోసాయి
42. ఓ దీనదయాళూ దయచూపుమయా - మా అందరిపాలిట ప్రభువయ్యా
43. నా పై కృపను చూపుమయా - నీ చరణాలను నెరనమ్మితిని
44. నిండు భక్తితో చేయండిగానం - లభించును ముక్తికి మార్గం
45. రేయి పగలు నీ ధ్యానం - నిత్యం నీ లీలా పఠనం
46. సాయి వారితో నడచునయా - ఒకరి కొకరుగాకలగలిసీ
47. నీ పలుకులు చేయును సంతసము - సాటిలేనిది సాయినామం
48. సాయి నామం నమ్మినవారికి - జీవన్ముక్తి ఒసగునయా
49. సాయి శక్తి విరాట స్వరూపము - సాయిరూపం మొహనరూపం
50. సతతము సాయి ధ్యానము చేయండి - సాయి జై అని పలకండి.
templesdiary.com సౌజన్యంతో ...

![]() |

అనంతకోటిబ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సఛ్ఛిదానంద సద్గురు సాయినాథమహరాజ్ కీ జై
శ్రీ సద్గురు సాయి నాధర్పణమస్తు శుభం భవతు
templesdiary.com సౌజన్యంతో ...
అద్భుతమైన అనుభవం -అత్యద్భుతమైన రోజు
“పరమం పవిత్రం బాబా విభూథిం.
పరమం విచిత్రం లీలా విభూథిం.
పరమార్థ ఇష్టార్థ మోక్ష ఫ్రధానం.
బాబా విభూథిం ఇదమాశ్రయామి.
సాయి బాబా విభూథిం ఇదమాశ్రయామి “
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః
నిజానికి ఈరోజు గురించి ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమక పడుతూ ఇలా సాయి ఫోటోలు అవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. పదాలకి మాటలకి అందని అద్భ్తమైన అనుభూతిని ఇచ్చిన ఈరోజు గురించి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే నా మనసులోని భక్తి అనే ఆ భావం నేను అనుకున్నట్లుగా మీకు చేరుతుంది? అసలు పూజ అంటే ఏంటో తెలియని వాళ్ళం దీపం మాత్రం పెడితే పూజ అయిపోతుంది అనుకునేవాళ్ళం, మరి మా కుటుబాన్ని ఆ బాబా ఎందుకు కరుణించాడు? ఏమో! పోని జరిగి రెండు సంవత్సారాలయింది కుప్పలు తెప్పలుగా ఐశ్వర్యమిచ్చేసి, ఐశ్వర్యవంతులని చేశాడా లేదు, ఇంకా ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. కష్టం అంటే ఇదీ అని చెప్తునే ఉన్నాడు, ఆ కష్టాన్ని అవలీలగా దాటే అవకాశమూ ఇస్తున్నాడు, అవమానం అంటే ఏంటో కూడా చెప్పాడు, అనుభవించమన్నాడు. ఆత్మాభిమానం దెబ్బతినడం ఎనటో అనుభవ పాఠం నేర్పాడు, ఒడి దుడుకుల మధ్య ఉన్న మమ్మల్ని ఇంకా ఆటుపోట్లు వెన్నంటే ఉన్నాయి. మరి ఎందుకు మా కుటుంబానికి తన ఉనికి చాటాడు? దేవుడు అంటే కనిపించని శక్తి అనుకునే మాకు కాదు నేనే అంటూ ఎందుకు తెలియజేశాడు? మేమెలాగు ఆర్భాటమగా పూజ చేయలేమనా? మాకేలాగు అన్నదానం చేసే శక్తి లేదనా? లేకపొతే మీ బంధువుల దగ్గర నీ స్థానం ఇంతే అని చెప్పడానికా? ఇందులో దేనికోసం? ఎందుకోసం తన ఉనికిని మా కుటుంబానికి తెలియపర్చారు?
ఇప్పటికి ఎప్పటికి ఇవి జవాబు లేని ప్రశ్నలే.. కాని ఒక్కటి మటుకు అనుభవంలోకి వచ్చింది, అందరిమధ్యలో నా స్థానం , నా కుటుంబ స్థానం. ముఖ్యంగా గాలి ఎటు వైపు వీచితే అటువైపు తిరిగిపోయే మనస్థత్వాలు ఇవన్ని మా కుటుంబానికి తెలిసాయి. ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నామెమో అనేంతగా బంధువుల అవహేళనలు, ఆక్షేపణలు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. అయినా ఈరోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అత్యద్భుతమైన రోజు. కేవలం మాకే. మా కుటుంబం చేసుకున్న అదృష్ఠం ఈ రోజు. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న ఈరోజు గురించి నెనెంత రాసినా తక్కువే. ఏమి చేద్దాం ఈ ప్రత్యేకమైన రోజు అని మా కుటుంబం తో కూర్చుని చర్చించుకుంటే, మనమేమి చేయగలము? ఆయనని స్థుతించడం తప్ప, అని అనుకున్నాము, ఆర్భటాలు, అన్నదానాలు ఆయనకి తృప్తి నిచ్చేవే అయినా మాకంత స్థోమత లేక అభిషేకం, అర్చన చేద్దామని నిశ్చయించుకున్నాము. తెల్లవారుఝామున 4 గంటలనుండే మొదలెడదామని మా నిర్ణయం. "సబ్ కా మాలిక్ ఈశ్వర్ ' అనే బాబా ఈశ్వర్ కి మేమేమి చేయగలము? "శివ శివ బాబా శంకరా,, భక్తవ బాబాశంకరా శంభో హర హర బాబా నమో నమో" అని అనడం మాత్రమే ప్రస్థుతం తెలిసినవాళ్ళము.
సరిగ్గా రెండు సంవత్సారల క్రితం మా కుటుంబంలో జరిగిన ఈ అత్యద్భుత సంఘటన
08-05-2010: వీభూదితో సాయిబాబా ప్రత్యక్షం... విబూధితో కుటుంబ పెద్ద పూజ
చేసుకున్నారని అనుకుని, పనమ్మాయికి గిన్నెలు వేద్దామనుకుంటూ, పైన
అమ్మవారిపటం మీద రోజు వారిగా చదివే శ్లోకం గంగా భవాని, గాయత్రి శ్లోకం
చదువుతూ యధాలాపంగా కింద చూసేసరికి ఎర్రటి అక్షరాలు తిరగేసి రాసి ఉండడం..
భయంతో ముందు దగ్గర్లో ఉన్న బంధువులకి ఫొన్ ఆ తరువాత దూరం వారికి....అలా అలా..మొదలయింది ఆరోజు.
ఆ అక్షరాల
సారాంశం: శ్రద్ధ వీబూధి నవవిధభక్తి 11/- సమర్పించండి మీ కోరికలు తీరతాయి,
ఈ ప్రదేశం బాగుంది.
ఇంతేనా. అని అనుకోకండి చెప్పాము కదా! మాకు ఇంతకన్నా వర్ణించడం రావడంలేదు. పదాలు అక్షరాలు మూగబోయాయి
*****
Sunday, 6 May 2012
దైవానికి దగ్గర చేసే సత్సంగం
నేడు సమాజంలో నెలకొని ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం సత్సంగమే. సత్సంగం వలన మనిషికి తన గమ్యమేమిటో, ఏది సత్యమో, ఏది నిత్యమో, దేనిని ఎలా పొందాలో, దేనిని త్యజించాలో అనే విషయాలలో విచక్షణ కలుగుతుంది. సత్సాంగత్యం వలన మనసు పవిత్రమవుతుంది. విశాలదృక్పథం ఏర్పడుతుంది. అహంకారం తొలగి విశ్వవ్యాపిత భావన ఏర్పడుతుంది.
సత్సంగం అంటే సజ్జనుల సాంగత్యం లేదా సత్‌గ్రంథం, సత్‌కర్మ, సత్‌చింతన, సత్‌స్వరూపులతో సాంగత్యం లేదా సంపర్కం ఏర్పరచుకోవడం. సత్సాంగత్యం వలన నేను, నాది, నాకు అనే ఆలోచనలు తగ్గి మానసికంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. సత్సంగాల వలన సమాజానికి మేలు జరుగుతుంది. సత్సంగంలో పాల్గొనే వారు మంచి ఆలోచనా విధానాన్ని కలిగి నిరంతరం భగవత్ సేవలో ఉంటూ, భగవత్ కార్యాలను చేస్తూ ఉంటారు. అందుకే ‘స్వామి వివేకానంద’ ‘‘ఒక మనిషి నిరంతరం చెడు మాటలు వింటూ, చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అతని మనస్సంతా చెడు ముద్రలు పడిపోతాయి. అవి అతడి ఆలోచనలను, పనులను ప్రభావితం చేస్తాయి. వాటి చేతులలో కీలుబొమ్మగా మారిపోతాడు. అవి అతడి చేత బలవంతంగా చెడు చేయిస్తాయి. అదేవిధంగా ఒక మనిషి మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే వాటి ముద్రలు అతడి చేత బలవంతంగా మంచినే చేయిస్తాయి. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క సచ్ఛీలం సుస్థిరమైనదని చెప్పబడుతుంది. అందుకే మంచి శీల నిర్మాణం జరగాలంటే సత్సంగం తప్ప వేరే మార్గం లేదు’’ అన్నారు.
భౌతిక ప్రపంచంలో, ప్రాపంచిక భోగాల్లో, విషయ వాసనలు తగులుకొంటున్న కొలదీ మనిషి పతనమైపోతాడు. వీటన్నింటికీ విరుగుడు సత్సంగమే.సంగం సత్ చేయడం వలన సత్పురుషులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సద్గ్రంథాల నుండి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోగలుగుతారు. స్వార ్థప్రయోజనాల నుండి దూరమై సమాజ సంక్షేమం కోసం పాటుపడతారు. రాగద్వేషాలు అంటవు. ద్వంద్వాలకు అతీతంగా మనస్సు నిశ్చలమై యోగంలో జీవిస్తూ ఉంటారు. అలాంటి స్థితే పరమాత్మ దర్శనానికి అనువైనది. అందుకే సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం.
సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. అందుకు ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి ‘సత్సంగం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి?’ అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనను అడిగాడు. అప్పుడు శ్రీహరి, ‘ఓస్! ఇంత మాత్రానికే నా దగ్గరకు రావాలా? అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది. దాన్ని అడుగు’ అన్నాడు. అలాగే వెళ్లి ఆ పురుగుని ‘సత్సంగమంటే ఏమిటి?’ అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు ‘సత్సంగమంటే...’ అంటూ ప్రాణం వదిలేసింది. నారదుడు ఇలా జరిగిందేమిటా అనుకుంటూ మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు.
ఈసారి ‘అదిగో అక్కడ చెంగనాలు పెడుతున్న కోడెదూడను అడుగు’ అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతోటే అది కూడా ప్రాణం వదిలింది. నారదుడు మళ్లీ విష్ణువు దగ్గరకు వెళితే, ‘ఒక లేడి పిల్లను కంటోంది. పుట్టే ఆ పిల్లను అడుగు చెబుతుంది’ అనడంతో నారదుడు అప్పుడే పుట్టిన లేడిపిల్లను అడిగాడు. నారదుడికి అదే అనుభవం ఎదురయింది. నారదుడు బాధపడుతూ గట్టిపట్టుదలతో మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చిద్విలాసంగా ‘నారదా! కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు. అతడిని అడిగి నీ సందేహం తీర్చుకో’అన్నాడు. అప్పుడు నారదుడు ‘‘స్వామీ! మీరు నా సందేహం తీర్చుకొనేందుకు వెళ్లమంటున్నారా? లేక బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడకు పొమ్మంటున్నారా?’’ అని అడిగాడు. అందుకు శ్రీమహావిష్ణువు ‘అటువంటిదేమీ జరగదు.
ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది. నీ రాకతో వారెంతో సంతోషిస్తారు’అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్లాడు. కొడుకు పుట్లిన ఆనందంలో అక్కడ వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేశారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ‘‘నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ, ‘స్వామీ! మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింకపిల్లగా ఉన్నప్పుడు వేశారు. ఆ మాట వినటం చేత ఆ జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది. అనగా కేవలం ‘సత్సంగం’ అనే ఒక్కమాట వినడంతోటే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్రజన్మలు లభించాయి కదా! మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా! నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని’’ అన్నాడు ఆ బాలుడు. ఇదీ సత్సంగం మహిమ.
సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః
అన్నారు జగద్గురు ఆదిశంకరులవారు. సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటం. నిస్సంగం అంటే దేనియందు ఏ విధమైన అనురక్త్తి లేకపోవడం. సంగం సంకెళ్లవలె మానవుని బంధిస్తుంది. విషయ వాసనలు తగులుకుంటున్నకొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటన్నింటికీ విరుగుడు సత్సంగం. సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం.
- చంద్రారెడ్డి
యోగా గురువు
07/05/2012 సాక్షి దిన పత్రిక సౌజన్యంతో
Saturday, 5 May 2012
సత్స౦గ౦-సాయి పలుకులు
శ్రీ షిర్డీ సాయి పలుకులు: “ము౦దు ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను.ఇక రాబోయే జన్మలన్ని౦టిలోనూ మీతో ఉ౦డగలను. మన౦ మళ్ళీ మళ్ళీ కలుసుకు౦టాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు, నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి.”
______________________
బాబాగారి ఈ పలుకులు మనమందరం గుర్తుపెట్టుకోవాలి.. భేషజాలకు పోయి... మీతో మాట్లాడాల్సిన అవసరం మాకులేదనో, మీకు చెప్పాల్సిన అవసరం మాకేంటనో, మేము మాత్రమే భక్తులమనో ... మామూలు మనుషుల్లా చెప్పుడు మాటలు విని ద్వేషాలు, కోపాలు పెంచుకుని మాట్లాడడాలు మానేసి.....మళ్ళీ వాళ్ళే నలుగురిముందు 'శాంతి, శాంతీ' అంటూ నీతులు చెప్తున్నారు రాజకీయనాయకుల్లా.. మా సర్కిల్ లో ఇలాంటివాళ్ళని చాలా మందిని చూశాము ముందు అలాంటి మనస్థత్వాలని మార్చండి ఇలాంటి సత్సంగాల ద్వారా... అప్పుడు మనమనుకున్న మన సంకల్పం నెరవేరుతుంది...
"మన౦ సత్స౦గ౦లో కూర్చున్న తరువాత ఏక మనసుతో ఉ౦డాలి. ’నేను”అన్న భావనను మరిచి,’అ౦దర౦” అన్న భావన పూర్తిగా మన మనసులలోకి రావాలి. అపుడు అ౦దరు కలిపి ఒక వ్యక్తి అవుతారు. అ౦టే ఏక వ్యక్తిత్వ౦గా సత్స౦గ౦ ఏర్పడుతు౦ది. "
___________________________________________
(మీ ఇల్లే కాదు మా ఇల్లు కూడా, మీ ఇంట్లో దేవుడేకాదు మా దేవుడే, ఇది మాత్రమే దేవాలయం, మా వాళ్ళు ప్రేమతో చేస్తారు.... ) అనే సంకుచిత స్వభావం నుండి మారి మీరు రాసినట్లుగా "మన " అనే భావన రావాలని మేము కూడా మీతో పాటు ఆ బాబాగారిని ప్రార్థిస్తున్నాము.

Friday, 4 May 2012
Subscribe to:
Posts (Atom)